పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
234

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


ధికి పోబోవుచున్నాను. నే నేప్పుడును నాప్రజల సౌఖ్యము నే కోరి ప్రవర్తించితినని నేను మీకు ప్రమాణము చేయుచు న్నాను." ఆని లుయీ రాజు చెప్పెను. మరణదండ ససంగతి లయీ శాంతముగా వినెను. మరణమునకు తదూరగుటకు మూడురోజుల వ్యవధి యియ్యవలెననియు, తన కుటుంబమును చూడనియ్యవలెననియు , తనకొక మతాచార్యుని ఇయ్యవలె ననియు లూయీ కోరెను. ఆఖరి రెండు కోరికలను మన్నిం పబడెను... ఒక రోజు వ్యవధి మాత్రమే యియ్యబడెను. ఆ దిక్కు లేని కుటుంభమును, లూయీ చూచిన కడసారి చూపు మిక్కిలి దుఃఖకరమైనదిగా నుండెను , మరియొక సారి దర్శించెదనని కుటుంబముతో లూయీ చెప్పెను.. కాని దిరిగి వారిని చూడ లేక పోయెను. నే నాదురదృష్ట వంతులను చూడ లేను" అని లూయీ తనలో అనుకొనెను. ఆరాత్రి లూయీ శాంతముగా నిద్రించెను. మరుసటి యుదయు మయిదుగంటలకే నౌకరు లూయీని నిద్ర నుండి లేపెను, ఆయన స్వాధీనములోనిఆస్తి యంత యు నొక యుంగరము, ముద్ర , కొన్ని వెంట్రుకలు, నౌరున కిచ్చెను. అదిపర కే ఫిరంగుల మ్రోతలసు, వాద్యముల చప్పుడులును ప్రారంభ మయ్యెను. ఇంతలో సాంటెరి వచ్చెను. “నాకొరకు మీరు వచ్చినారు. ఒక నిమిష మాగు" డని లూయీ చెప్పి "తాను వ్రాసిన మరణశాసనము నా మ్యునిసిపలు యుద్యోగస్థుని కిచ్చి "పోదము రండి" యని లూయీ టోపీని ధరించి బయలు దేరెను. .