పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
233

పదు నేనవ అధ్యాయము


లోనే యుంచుటకును, సమ్మతుల నిచ్చిరి. మూడు వందల అరవ వది యొకరు వెంటనే మరణశిక్ష.. వేయవలెనని సమ్మతుల నిచ్చిరి. ఇరువదియారు ముంది ఎక్కువ సమ్మతులతో (మెజార్టీతో) రాజునకు మరణశిక్ష విధించవలెనను తీర్మాన మంగీకృతమయ్యెను. ఆధ్యక్షుడు దుఃఖచిహ్నముతో జాతీయసభ పేర లూయీ కాపటుకు మరణశిక్ష తీర్మానింపబడినదని ప్రకటించెను. కొద్ది మంది మెజార్టి వలన మాత్ర మే మరణశిక్ష తీర్మానింపబడినందున పునర్విమర్శ చేయవలసినదని రాజు మొక్క న్యాయ వాదులు కన్నీళ్ళ తో కోరిరి. “బహు కొద్దిమందిగల, యెక్కువ సంఖ్యతోనే చట్టము న్నియు చేయబడుచున్న "వని యొక యతివాది జవాబు చెప్పెను. "అవును. చట్టములు తిరిగి మార్చబడును. చనిపోయిన మనుషుల తిరిగి బ్రతికించజాలమని యొకరు ప్రత్త్యు త్తర మిచ్చిరి. పునర్విమర్శ, తీర్మానము మీద సమ్మతులు తీసికొనగా నది యోడిపోయెను.పదునారవలూయీ రాజునకు మరణదండన స్థిరపడెను.

రాజును శిర
చ్చేదము
చేయుట

లూయీ రాజందుకు సిద్ధపడి యేయుండెను. మాలేషెర్బీ కన్నిళ్ళు కార్చుచు నీ శిక్ష సంగతి లూయీకి చెప్పుటకు పోయినపుడు లూయీ చేతితో కన్నులు మూసి కొని యొంటరిగానేదోగొప్పయలోచనములో మగ్నుడై యుండెను. మాలే షెర్భీ వెళ్ళగనే లూయీ లేచి (రెండుగంటలనుండియు నా ప్రభుత్వములో నే సెప్పుడయిన నాప్రజలకు కీడు చేసితినా యని యాలోచించుకొనుచున్నాను. నే నిప్పుడే భగవంతుని సన్ని