పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
232

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

లూయీని కాపాడవలెననియే గిరాండిస్టులకు గలదు గాని తమ్మును, రాజరకమును తిరిగి నెలకొలుప దలచినవారిని దేశములో నతివాదులల్లురులు పెట్టుదురసు భయము వీరికి కలిగి ఎటు చేయుటకును తోచకుండిరి.అతివాదులు చాకచక్యముతో నాదోళనము సలిపిరి. రాజుతరపున వాదనయంతయు రాజరికమును తిరిగి స్థాపింపయత్నించుటయే యని వీరు చెప్ప సాగిరి. పెకోబిను క్లబ్బులు వీరికి తోడ్సడెసు. రాజును వెంటనే చంపవలెనని జాతీయభకు మహజర్లు వచ్చెను. నిర్గోషియని యనుటవలన ప్రయోజనము లేదని యెంచి ఆయన విషయమైన తీర్పు జాతీయసభవారు చెప్పక ఫెంచిప్రజలకు 'పదలివేయవలెనని కొందరు గిరాండిస్టులు తలచిరి. తీర్పు జాతీయ సభవారెచెప్పిఅందుమీద ప్రజల యభిప్రాయ మడుగ వలసినదని మరికొందరు గిరాండిస్టులు చెప్పిరి, రాష్ట్ర ములలోని ప్రజలు రాజును రక్షించుట కొప్పుకొనెదరని వీరి యాశ. ప్రజలకు వదిలివేయుటవలన "దేశములో అంత అంతర్యుద్ధము సంప్రాప్తమగునని కొంద రాక్షేపించిరి.. అన్ని విషతయములలోను 'జాతీయ సభ్యలయభిప్రాయము తీసు కొన బడెను. లూయి దోషియనియే అందరును ఏకగ్రీవముగా తీర్మానించిరి., ప్రజల యభిప్రాయము తీసికొనవలెనని రెండు వందల యెను బదిమంది సభ్యులును, జాతీయసభవారే పూర్తిగ తీర్పు చెప్పువలసినదని నాలుగువందల యిరువదినలుగురు సభ్యులును సమ్మతుల నిచ్చిరి. ఏమిశిక్ష విధించవలెనను విషయములో, గిరాండిస్టులలో కొందరు రాజును దేశ భోష్టుని చేయుటకును, కొందరు కొందరు ఖైదు