పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

'పదునేనవ అధ్యాయము

సంరక్షకులారా ! వినుడు. అతని భావి కాలములో నేమివ్రాయ నున్నదో యోచించు కొసుడు. లూయి రాజు ఇరువదవయేట చిన్నతనముననే రాజ్యమునకువచ్చెను: . నీతిలోను, న్యాయము లోను, మితవ్యయము లోను. ఆదర్శప్రాయమగు ప్రవర్తనను కలిగి యుండెను. ఆయనకు దురభ్యాసము లేవియు లేవు.. ఏ దుర్వసనము నకు నాయన లోనుగా లేదు. ఆయన ఎల్లప్పుడును ప్రజలకు స్నేహితుడగనే యు.డెను. తమ్మును పీడించుచున్న పన్నును తీసివేయమని ప్రజలు కోరిరా....-లూయీ వెంటనే రూపుమాపెను. సంస్కరణములు చేయ వలెనని ప్రజలు కోరిరా! లూయీ వెంటనే చేసెను. చట్టములు, మార్చవలెనని ప్రజలు కోరిరా? - లూయీ వెంటనే మార్చెను . లక్షలకొలది ఫ్రెంచి ప్రజలకు రాజకీయ హక్కులను కోరిరా? లూయి ఇచ్చెను. ప్రజలు స్వేచ్ఛను గోరిరా లూయి ప్రసాదించెను. ప్రజల కొరకు లూయీ గొప్పు త్యాగములు చేసెనని చెప్పుక తప్పదు.. ఇట్టి లూయీ ని మీరి చంప చూచుచున్నారు. పౌరులారా! ఇంతకన్న నెక్కువ 'నేను చెప్పను. తక్కినదంతయు చరిత్రకు వదలి వేయు చున్నాను . మీరిప్పుడు చెప్పు తీర్పును చరిత్ర విమర్శించునని గ్నాపకముంచు కొనుడు. ఇందు పై చరిత్ర యిచ్చెడి తీర్పు శాశ్వతముగా నుండును." అని యుపన్యా సమును ముగించెను... తీర్చుకు వాయిదా వేసి లూయి రాజును టెంపిలు కోటకు పంపిరి