పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
230

స్వాతంత్ర్యవిజయము

నాకు మరీ బాబూ. షెర్బీ రాజుతరఫున వాదించుటకు బూనుకొ నెను. " అప్పటి కనేక మంది గొప్పవారికి దుర్లభమయన మంత్రి పదవిని నాకు రెండు సార్లు లూయీ రాజిచ్చియున్నాడు. ఇప్పుడాయనకు నేను కృతగ్నతను చూపెద"నని మాలెషెర్బీ చెప్పెను. మాలె షెర్బీ లూయీ తో సంప్ర దించుటకు "టెంపిలు కోటలోని లూయీ యున్నగది లోనికి వెళ్ళగనే లుయీ లేచివచ్చి కన్నీళ్లతో మాలె షెర్బీని కౌగలించుకొని "మీత్యాగము మిగుల నౌదార్వ వం తమయినది. నాప్రాణమును మీరు సం. క్షించ లేక పోగా, మీ ప్రాణమునకు కూడ నపాయమును తెచ్చు కొన్నారు." అని లూయీ చెప్పెను. మాలె షెర్బీ , ట్రన్ షెటు, డె జ్జీ లను ముగ్గురు న్యాయవాదులు ముద్దాయి వాదమును తయారు చేసిరి. "నాప్రాణమును తప్పక తీసెదరు. నాకు మరణము. నిశ్చయము. కాని, నేను నిర్దోషినని బావి సంతతి వారికైనను తెలియగలందులకు మనము వాదించుటవసర"మని లూయీ వీరితో చెప్పెను.


రాజునకు
మరణ శిక్ష
విధించుట.

విచారణ దినమున లూయి రాజు హాజరయ్యెను. అనేక మంది ప్రజలు చూడ వచ్చిరి. అంతయు బహు నిశ్శబ్దముగా నుండెను. లూయి తరఫున న్యాయవాదులలో డెజ్జీ వాదనమును నడిపెను. అనేక హేతువులను యుక్తి యుక్తముగా చెప్పి లూయి. రాజు కెప్పుడును పవిత్రమయి నట్టియు ప్రజా సౌఖ్యమును గోరునట్టియు యుద్దేశ్యములు మాత్రమే కలవని చూపెసు. గంభీరమైన యుపన్యాసముతో వాదమును ముగించెను: “న్యాయ