పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

227

పదునేనవ అద్యాయము


శ్యక మేదో దానినే చేయుట మీవిధి. జాతిని కాపాడుట మీ ధర్మము, సింహాసనభ్రష్టుడయిన రాజు చెడుపనులకే తగి యున్నాడు; దేశము యొక్క శాంతిని భంగపంచుటకును, దాని స్వాతంత్యమును చెడగొట్టుటకును లూయి రాజుగ నుండెను.. ఆయనను తీసివేసి ప్రజా స్వామ్యమును స్థాపించితిమి. ఇందువల ననే మీ రాలోచించుచున్న సమస్య తేలిపోయినది. లూయీని విచారించనక్కర లేదు. ఇదివరకే మీరు విచారించి దోషియని నిర్ధారణ చేసియున్నారు. లేని యెడల ప్రజాస్వామ్య మును స్థాపించి యుండెడివారు గారు " అని అతి వాద నాయకుడగు రాబిస్పీయరు చెప్పెను. "ఒక రాజునకు న్యాయమైన శిక్షవిదిం చుటకు చేతులువణుకుచున్న వారు, శాశ్వతపు పునాదులమీద ప్రజా ప్రభుత్వము నెటుల నిర్మించగలరు. స్వాతంత్రముసు గోరు పౌరులారా! స్వంతంత్రముసు పొందిన ప్రధమ దివశము నుండియు మీ బానిసత్వమును గౌరవముగా గ్నాపక ముంచు కొను నెడల రోమనుల వలెను ఇంగ్లీషు వారివలెను కొంత కాలముయిన తరు వాత నయిన తిరిగి రాజును తెచ్చి పెట్టు కొనుదురను భయము నకు తావుండదా? అని సెంటు దస్టు చెప్పెను. జాతీయ సభలో నెక్కువమంది యొక వైపున అతివాదుల యభిప్రాయములను మరియొక వైపున రాజును విచారించనే గూడదను వారి వాదనలను త్రోసివేసి, లూయీ రాజును విచారించుటకే తీర్మానించిరి. ఆయన మీద నేరారోపణ చేసి ఆయన జాతీయ సభకు వచ్చి జవాబు చెప్పవలసినదని కోరిరి.