పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
228

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

నాలుగు నెలనుండియు లూయిరాజును, కుటుంబమును టెంపిలుకోటలో ఖైదీలుగ నుండిరి. ప్యారిసు మ్యునిసిపాలిటీ. వారు బహు అను మాసముతో గట్టిగా కాపుదల చేసిరి. లూయి యన్నిటికిని మనస్సు సమాధానపర్చుకొని శాంతచిత్తుడై తనకు రా నున్న దాని సనుభవించుటకు సిద్ధము గానుండెను. క్లెరీ యను ఒక నౌకరు మాత్రమే ఈయన యొద్దనుండెను. అతడే ఆయన కుటుంబమునకును సేవ చేయుచుండెను, ఖైదు వేయ బడిన మొదటి నెలలలో ప్రతిదినమును ఆయన కుటుంబముతో కలిసికొను చుండెను. దీనివలన ఆయన మనస్సునకు కొంతవరకు తృప్తియుండెను. దుర దృష్టము లో భాగస్వాములుగా భార్య యగు మేరి ఆంటీ వెటును, సోదరియగు ఎలిజబెత్తును నుఁడిరి. వారి నీయన యోదార్చుచుండెను. చిన్న రాకొమరునికి లూయి దురదృష్టవంతులను గూర్చిన విషయములు బోదించుచుండెను. లూయి ఏశేషముగా గ్రంధములను చదువుచుండెను. ఇంగ్లాండు చరిత్రను తరుచుగా చదువుచు ఇంగ్లీషు ప్రజలు సింహాసనభ్రష్టు లను చేసి రాజల కథలను, ఇంగ్లీషువారు శిరచ్చేదము చేసిన చార్లెసు రాజు చరిత్రమును ముఖ్యముగా పఠించుచుండెను. కాని కుటుంబమును ప్రతి దినము చూచు భాగ్యముకూడ నాయనకు త్వరలోనే పోయినది. ఆయనను విచారణ చేయవలేనను నా లోచనలు ప్రారంభము కాగనే అందరును కలిసి యాలోచించు కొసకుండ"నాయను, కుటుంబమును వేరు జేసి యొక రి నొకరు చూచుకొనకుండ ప్యారిసు పురపాలక సంఘమువారు కట్టుదిట్ట ములుచేసిరి.