పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

వారు విచారించవచ్చునని యభిప్రాయ మిచ్చిరి.రాజుగా గాక ప్రత్యేక వ్యక్తిగా శిక్షాస్మృతి క్రింద దేశద్రోహ నేరమునకై విచారించవచ్చుననియు,దేశములోని న్యాయమున కంత కును మూలస్థానమయిన ప్రజ లెన్న కొనిన ప్రతినిధులగుట వలన, జాతీయసంఘమున కట్టి విచారనాధికారము గలద నియు నీ సంసమువారు - అఖ్యాయికను వ్రాసిరి. ఈ నినే దనవచ్చిన యారుదినముల కనగ 13 నవంబరు నుండియు, జాతీయసభలో నీవిషయమై తిరిగి చర్చలు జరిగెను. రాజును శిక్షించుట ఎవరకిని అధికారము లేదనియు, జూతీయసభ “కాయనపై న్యాయవిచారణ చేయుటకు హక్కు లేదనియు, నింతేగాక రాజునకు న్యాయము, కరుణ కసుపఱచ వలసిన దననియు, సూతన ప్రజాప్రత్వ మాదార్య వంత మయినదను కీర్తిని పొందవలసిన దనియు, రాజును శిక్షించుటవలస దేశము లోపలను బయటను ఉపద్రవము లెక్కున కలుగుట కారకమగు ననియు, కొందురు చెప్పిరి. అతివాదులు, లూయి రాజు దేశ ద్రోహియనియు, మానవకోటికి శతృపనియు, ఆయన జీవించి యుండుటవలన దేశములో విద్రోహపు తిరుగు బాటులకు 'కారణముగుననియు, విచారణలేకుండుగనే ఆయనకు మరణ శిక్ష విదించుట దేశక్షేమముస కత్యావశ్యకత మనియు చెప్పిరి “విచారణతో మనకు సంబందము లేదు; లూయి ముద్దాయి. గాడు, 'మీరు న్యాయాధిపతులుగారు; మీరు రాజకీయవేత్త లు; ఒక మనుష్య నివిూద నేరము స్థాపనము చేయుటగాని నిర్దోషి యని చెప్పుటగాని మీపని కాదు; మీదేశ సురక్షితమున కావ