Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

223

పదు నేనవ ఆధ్యాయము

ఈరాయ జారమును తృణీకరించెను. ఇంగ్లీషు ప్రముఖుడగు బర్కు ఫ్రెంచివిప్లవమునకు వ్యతిరేకముగ “Reflections on the French Revolution"అను గ్రంధమును ఫ్రకటించుటయే గాక ఆంగ్లేయ ప్రభుత్వము వారు యూరపులోని ఫాన్సుపై యుద్ధము చేయునట్లు పురిగొల్పిరి.


3

స్వాతంత్ర్య
ప్రకటనలు

నవంబరు 19 వ తేదీన, ఏ దేశ ప్రజలయినను స్వాతం త్రమును గోరి, తమ్ము పొలించుచున్న రాజులయిన తిరుగుబాటు చేసిన యెడల, తామట్టి ప్రజలకు సహాయము చేయుటకు సంసిద్ధుముగ నున్నామని, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వమువారు ప్రకటనమును గావించిరి. డిసెంబరు 15 తేదీన, ఫ్రెంచి సైన్యములు పోయిన చోట నెల్ల, ప్రజలే తమ దేశ మును పాలించుకొనుటకు హక్కుదారులనియు, తమ పైనున్న నిరంకుశ ప్రభుత్వములను ప్రభువులుంపరల ప్రత్యేక హక్కులను కూలదోసి, స్వతం త్రమైన ప్రజాపాలనమును సాధించు కొనవచ్చుననియు, నిందుకు తాము తోడ్పడేదమనియు ప్రజలలో ప్రకటించవలసినదని, ఫ్రెంచి ప్రభుత్వమువారు ఉత్తరువులను జారీచేసిరి. డిసెంబరు నెలలో ఫ్రెంచి సైన్యములు హాలెండు నాక్రమించెను.


రాజును
విచారించుట

ఖయిదు చేయబడిన రాజును విచారించి మరణ శిక్ష విధించవలెనని అతి వాదు లాందోళనము ప్రారంభించిరి. క్రొత్తగా నేర్పడిన ప్రజాస్వామ్యమునకు రాజు దేశములో బ్రతికియుండు టపాయకరమని జేకోబిన్ క్లబ్బులు తీర్మానించిరి. రాష్ట్రముల