పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222


ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

పోయి నవంబరు 6 వ తేదీన జాంపెను యుద్ధములో ఆస్ట్రియా వారిని పూర్తిగా నోడించి, బెల్జియమును స్వాధీన పఱచు కొనెను. సావాయి, నైసులు పాన్సులో చేరుటకు సమ్మ తించినందున ప్రాన్సు యొక్క రాష్ట్రములుగ చేయబడెను . బెల్లీయము లోని ప్రభువులును, మతగురువులును ఆటంకము గలుగ జేయుచున్నందున బెల్జియమును స్వంతంత్ర మయిన ప్రజా స్వామ్యమునుగా నుంచవలేనా లేక ఫ్రాస్సులో కలుపుకొన వలెనా యనువిషయములను ఫ్రెంచి జాతీయసభవారు ఆలో చించుచుండిరి. స్కెల్టునదిలో స్వేచ్ఛగా సన్ని జాతుల వారును వర్తక ఫు టోడలు తెచ్చుకొనుటకై ఫ్రెంచివా రనుజ్ఞనొసంగిరి. ఇదివఱకు నాంగ్లేయుల యోడలు మాత్రమే యీసది లోనికి వచ్చుచుండెను. బెల్జియము ఫ్రాన్సులో చేర్చుకొన బడుటకుగానీ స్వతంతమయిన ప్రజాస్వామ్యముగా చేయబడుటకుగాని, ఆంగ్లేయుల కసమ్మతము. ఫ్రాంన్సును విజృంభించకుండ సణచ గల యొక రాజు పాలసములోనే బెల్జియ ముండ వలెనని ఇంగ్లీ షువారి పట్టుదల. పోలండు. మీదికి దండెత్తుటకై ఫ్రెంచివారు యోచించుచుండిరి. వీలయినచో సంధి చేసికొని యుద్ధ మంత రింపజేయవ లెసనియే ఫ్రెంచి జాతీయ ప్రభుత్వమువారు తిరిగి ప్రయత్నించిరి. హాలండు పై తాము దండెత్తుట మానుకొనెద మనియు, ఫ్రెంచి రాజును, ఆయన కుటుంబమును ఫ్రాన్సును విడిచిపోవుటకు సమ్మతించెదమనియు, బెల్జియము సంగతి సంధి జరుగుపరకును నిలిపి యుంచెదమనియు ఫ్రెంచివారు ఇంగ్లాండు నకును, ప్రష్యాకును సంధి రాయబారములను బంపిరి.. ఇంగ్లాండు