పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
224

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయములోని ప్రజా సంఘములును నిట్టి తీర్మానములనే చేసి - జాతీ యసభకుపంపెను, ప్యారిసు సగర ప్రజలు 10 వ ఆగష్టు తేదీన రాజ సైన్యములచే గాయములు పొందిన వారిని జాతీయ సభకు మోసికొని వచ్చి 'దీవికీ లూయి కాపలుకు ప్రతీకారము చేయవలసిన 'దని కోరిరి. పదునారవలూయి రాజను నామము తీసివేసి, లూయికాపటని ఆయనను ప్రజలు పలువ సాగిరి.. “కాపటు లూయిరాజు కుటుంబనామము. గిరాండిస్టులు రాజుయొక్క ప్రాణమును రక్షించవలెనను. సుద్దేశ్యము గలిగి, యుఁండిరి. గీరాండిస్టులను ప్రజలకు ని ద్వేషులుగ జేసి అక క్షిని పడగొట్టు నూహతో అతివాదులు రాజును చంపవలెనని పట్టు పట్టిరి.ఈ సమయమున తాము ప్రజానురాగమును పొంది 'యధికారమును సంపాదించవలెనని వీరిపన్నుగడ.


దురదృష్టవశమున 10 వ ఆగష్టకు తరువాత సివిలు దస్తావేజులున్న కచ్చేరీలలో లూయీ రాజు దేశ విరోధులతోను. యూరపు రాజులతోను కుట్రలు సలిపిన యుత్తరప్రత్యుత్తర ములు దొరకెను. 1791 సంవత్సరము 16 వ యేప్రిల్ తేదీన, తనకు తిరిగి యధి కారము వచ్చినచో విప్లవము నణ చెడి ప్రాత నిరంకుశ ప్రభుత్వమునే స్థాపించెదసనియు, మతాచార్యులకు వెనుకటి స్థితిని గలుగ జేసెదననియు, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వ ముతరఫున దాసు యూరపు రాజులమీద యుద్ధమును ప్రకటిం చినది, వారు త్వరగా దండెత్తవచ్చి ఫ్రెంచి ప్రజల నోడించి తనకు విముక్తి గలుగ జేయుదు రనునాశ తో మాత్రమే చేసితి పనియు, క్లేరుమాంటు బిషప్పుడు (మతాచార్యునికి) లూయీ