పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

211

పదునాలుగవ అధ్యాయము

ఇతర రాజ్యముల
తో స్నేహమును
గోరుట

విదేశ రాజులతో తమంతట తాము కలహించవలె నను నుద్దేశ్యము శాసనసభకు లేదు. సాధ్యపడిన యెడల స్నేహ ముగా నుండవలె నసుతలంపు మాత్రమే గలదు. నవంబరు 20వ తేదీని శాసనసభవారొక శాంతికరమగు ప్రకటనమును గావించిరి. “ఇతర దేశములను జయించవలెనను గోరిక ఏమాత్రమును ప్రెంచి ప్రజలకు లేదని ప్రమాణము గావించుచున్నాము. ప్రక్క నున్న "దేశముల వారి వాత్సల్యతనే గోరుచున్నాము. స్వాతంత్యమును పొందినట్టియు, గొప్పదై నట్టియు మాజాతి తరపున మీకందరకును మా మనఃపూర్తి యగు స్నేహభావమును ప్రకటించు చున్నాము. మీ యొక్క చట్టములను, మీ యూచారములను, మీ ర్యాజ్యాంగ విధానము లను మేము గౌరవించెదము, వాటితో మేమెట్టి జోక్యమును కలుగజేసి కొనము. మా చట్టు ములను, మా రాజ్యాంగ విధాన మును మీఉకూడ గౌరవించెదరని సమ్ముచున్నాము. మీ ర్క్రమముగా మామీద యుధ్ధమునకు వచ్చిన యెడల లోపమం తయు మీదేయగును. మే ముప్పుడు మా సైన్యములను మాపిరం గులనేగాక, మా స్వాతంత్ర ధర్మమునుగూడ మీకు వ్యతి రేక ముగ నిలువ బెట్టెదము. పుసర్జీవమును పొందిన ప్రజలతో యుద్ధ ముచేయుటవలన మీకు గలిగెడి పలితములకు మీరే జవా బుదారులగుదురని విదేశీ ప్రభువుకు తెలియపంచవల సినదిగా రాజును కోరిరి. లూయీ రా జట్లు తెలియపరచెను. కానీ యూర పురాజు లెవరు నీ శాంతి సందేశమును