Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210


ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

వత్సరము జనవరి1 వ తేదీలోపల దేశ ములోనికి తిరిగిరాని యెడల కుట్రదారుగా భావింపబడి వారిమీద మరణశిక్ష విధింపబడుననియు వారి భార్యలయొక్కయు పిల్లల యొక్కయు ఋణదాతల యొక్కయు న్యాయమయిన హక్కు'లకు లోబడి వారి యొక్క యావదాస్తిని ప్రభుత్వము వారు తీసుకుందురనియు శాసించిరి. నవంబరు 29 వ తేదీన జాతీయ ప్రభుత్వము నొప్పు కొనుచు శపధములు తీసికొనినమెడల, మతాచార్యుల యుపకార వేతనములు తీసి వేయుబడు ననియు వానిని తిరుగుబాటు దారులుగా భావించి నిగహాలో నుంచెదమనియు శాసించిరి.


లూయీ రాజు తన సోదరుని మీద చేయబడిన శాసన ము నంగీక రించి దస్క తును పెట్టెనుగాని, "దేశబ్రష్టులనుగూర్చి యు మతాచార్యులనుగూర్చియు శాససభవారు చేసిన శాసన ముల నంగీక రించక త్రోసి వేసెను. శాసనసభలోని కక్షుల లో నొకరి మీద నొకర నెక్కించి తాను నిజమైన యధికారమును చ లాయించవలెనని రాజు యత్నించెను. ఎప్పుటికైనను తమకు మంచిరోజులు వచ్చునేమోయను నాశతో రాజును, రాణియును కుట్రలు సలుపుచుండిరి. ఫ్రెంచిక్లబ్బను పేర నొక క్లబ్బును ప్యా రిసు పట్టణములో తన కుట్రదాయడగు మోలి వెలి చేత స్థాపింప జేసి, యాక్లబ్బులో రహస్యముగా జీతము లనిచ్చి సభ్యులను జేర్పించి, రాజుపక్షముగా నాదోళనము చేయించుచుండిరి. కొంతమంది మితవాదులగు శాసన సభ్యులు కూడ లంచములు పుచ్చుకొని ఈకుటృలో చేరిరి