పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
202

ఫేంచి స్వాతంత్ర విజయము

చేసికొనియున్ననెడ తెగ లక్ష్యపెట్టక కిరీటాధి పతుల యెక్క గౌరవముకొఱకును, సురక్షితముకొరకును, యొడంబడికను మార్చుకొనుటకు వీలు లేదని ప్రత్యుత్తరమిచ్చిరి. తరువాత నిరువదిమూడు సంవత్సరములవరకును యూరపులో జరిగినన ఘోర యుద్ధమునకు, నిరంకుశత్వమును పునరుద్ద రింప దలచిన రాజులే జవాబుదారులు, ఫ్రెంచి జాతియొక్క స్వయం నిర్ణయమునకును, స్వాతంత్యమునకును, యూరపు యొక్క నిరంకుశత్వమునకును, దురాశకును. మధ్య జరిగిన ఈ యుద్ధములో, ప్రధమము నుండియు సంగ్లాండు నిరం కుశపుపక్షముననే నిలవబడి ఫ్రెంచి ప్రజ లేర్పరచుకొన్న ప్రభుత్వము నిర్మూలనమై , పదు నెనిమిదవ లూయీ రాజును బల వంతముగా ఫ్రెంచి ప్రజల పైన కట్టువరకను పోరాడెను.

3

యుద్ధములో
సపజయములు,

ఫ్రాన్సు దేశము యుద్ధమునకు తయారయ్యెను. గిరాం డిస్టులు శాసనసభలో ఎక్కువమంది యు నెక్కువ పలుకుబడి గలిగియు నున్నందున లూయిరాజు వారిలోనుండి మంత్రుల నేర్పరచుకొనవలసి వచ్చెను. ఏప్రిలు 20 వ తేదిన లూయి రాజు శాసనసభకు వచ్చి ఆస్ట్రియా మిద యుద్ధమును ప్రకటించెను. ఈ వార్త, ఫొస్సు దేశమునకు సంతోషము కలిగించెను. పట్టణము లలోను జల్లాలలోను సుత్సాహముతో ప్రజలు సైన్యములో చేరిరి. ధనసహాయముకూడ బాగుగా చేసిరి. కాని ఏప్రిలు 28 వ తేదిన బెల్జియములో ఫ్రెంచి సేనలు ఆస్ట్రియా వారిచే.