పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

పదుమూడప ఆధ్యాయము

సభవారు క ఠిన, శాసనములను చేయకూడదనియు నీయన వ్రా యుచుండెను. “ప్రజల స్నేహితు"డ ను పత్రిక యొక్క అధిపతి 'డాక్టరుమా రెటుగా రింకను రక్తపాతమై స్వాతంత్యమునకు వ్యతి రేక ముగనున్నవా రందరిని చంపువరకును దేశమునకు మోక్ష ముండదని వ్రాయుచుండెసు.

5

మతగురువులలో
రెండు కక్షలు

జూతీయసభ వారు బిషప్పుల (మతా చార్యుల) యొక్క యు సామాస్య మతగురువుల యొక్కయు సంఖ్యను తగ్గించి. రాష్ట్ర మున కొక బిషప్పుం డుట చాలుననిరి. ఈ మతాచార్యులను గురువులను శాసనసభ నెన్నుకొనెడి ఓటర్లే ఎన్ను కొనునట్లేర్పరిచిచి. వీరందరికిని జీతముల నేర్పఱచిరి. నూతన బిషపులును మతగురువులును కొత్త రాజ్యంగమునకు విధేయుల మగుదుమని శపథములు చేయవలెనని శాసిం చిరి, పరాసు దేశము ముఖ్యముగా రోమసు కాథలిక్కు దేశము. రోమను కాథలిక్కు మత పీఠాధిపతి రోములోని పోపు పరాసు దేశములోని మతగురువులను తాను నియమించవలెనే గాని ఫ్రెంచి ప్రజలెన్ను కొనగూడదనియు, మతగురువు లెవరు ను ప్రభుత్వమునకు లోబడుదుమని శపధములు తీసికొనగూడ దనియు నాజ్ఞాపించెను. అందుమీద కొందరు మతగురువులు మాత్రమే శపథములు తీసికొనిరి. తక్కినవారు విప్లవమునకు