పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
192

ఫ్రెంచి స్వాతంత్ర్య :విజయము

వ్యతి రేకులై మత మపాయకరమగు స్థితిలో సున్నదని రోమను కాథలిక్కు ప్రజలకు బోధించుచు, నూతన ప్రభుత్వముపై నాగ్రహమును పురికొల్పు చుండిరి. శపధములుగై కొనని వారు మతబోధలు చేయకూడదని యసభవారు "శాసించిరి. వారు రహస్యముగా బోధించు చుండిరి .. మతగురువులలో రెండు కక్ష లేర్పడెను.. ప్రభుత్వపక్ష మువారు, పోపు పక్షమువారు . కొన్ని చోట్ల వారికి, కొన్ని చోట్ల వీరికే పలుకుబడి గలిగియుండె ను. కలహములు తరుచుగా గలుగుచుండెను. పోపు పక్షవాదులు ప్రభువులలో చేరి స్వాతంత్యవిద్వేషు లై కుట్రలుసలుప వారం భించిరి. కొంతమంది ప్రభువులు మాత్రము ప్రజలపక్షము చేరి. కొంతమంది దేశ మువిడిచి వెళ్ళిరి. మరికొందరు ప్రభు వులు దేశములో నేయండి కుట్రలు చేయుచుండిరి. కష్టముల వలన జాతీయసభ లొంగిపోవునని వేచియుండిరి. కొన్ని చోటులు కుట్రదారులు తిరుగు బాటులు చేయించిరి. నాన్ సీలోని సైన్య ము లెక్కుపజీతములు కావలెనని తిరుగుబాటు చేసిరి. బౌలీ సే నాని తిరుగు బాటుల నన్నింటిని అణచివేసెను. సైనికుల జీతము లెళ్కువ చేసెను. 1790 సెప్టెంబరు నెలలో నెక్కరుమంత్రి తసకెట్టియధి కారము లేదని గృహించి, రాజీనామా నిచ్చెను. మొత్తముమీద ఫ్రాన్సు దేశములోని యధిక సంఖ్యాకులగు ప్రజలు, జాతీయసభ వారు చేయుచున్న సంస్కరణములకు సంతోషమును తృప్తిని కనబఱచి. నూతన రాజ్యాంగవిధాన ముసు మనస్ఫూర్తిగా సంగీకరించిరి.