పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
190


ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

ప్రధమములో లామొత్తులు, గార్నేన్ మొదలగు మితవాద నాయకుల పలుకుబడిలో నుండెను, తరువాత రాబిస్పేయయరు మొదలగు సతివాదుల యాజమాన్యము కిందికి వచ్చెను. '89 క్లబ్బులలో, అబీ సైసు, లఫయతు ముఖ్యులు. కారిడిలీన్ అను క్లబ్బులు తీవ్రవాదులగు డాస్టన్ మొదలగు వారుస్థాపించు కొనిరి. రాజుపక్షముననున్న ప్రభువులు కూడ క్లబ్బులు స్థాపించిరిగాని, విశేష కాలము నిలువలేదు. మితవాదులకు వేరొకక్లలబ్బు కలదు., పత్రికలు ప్రధాన స్థానము నాక్ర మించు కొని యున్నవి. కొందరు తీవ్రవాదులు తమపత్రిక లలో జాతీయసభా చర్యులు తగిసంత తీవ్రముగ లేవని ఖండించు చుండిరి. ఆ కాలములో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన పత్రికాధిపతి బ్రిస్సో, ఈయన తీవ్ర వాది. గికాండిస్టు లను కక్షికి నాయకుడు. ఈయన రాజు లేని ప్రజాస్వామ్యము కావలెనని తమ పత్రిక లో వ్రాయు చుండెను, వాణిజ్య స్వేచ్ఛ, పత్రిస్వేచ్చ ప్రజలందరకును విద్య, మత స్వాతంత్యము, కాయక ష్టమునకు గౌరవము మొద లగుచిషయముల నీయని బలపరచుచుండెను. ప్రతివాడును తన జీవితములో నీతిమంతుడుగా నున్నగాని జాతి గొప్పది కానే రదనియు, నీతి, ధర్మము ప్రధానములనియు, నీయన బోధించు చుండెను. కమీల్ డిమొలి” అను నాయన తెన “లి రివల్యూ షన్ " పత్రికలో రాజును తీసివేయవలసిన దనియు, వోట్లు అం దరికి నుండవలెననియు శతాబ్దములనుండి హీనస్థితిలో సుడిన ప్రజలు మేల్కొనునప్పుడు కొంతవరకైనను అల్లరులు, రక్త పాతము జరుగక తప్పదు గావున అల్లరుల సణచుటకు జాతీయ