పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
180

ఫెంచి స్వాతం త్య విజయము

ఆయన తీర్మానమును బెట్టెను. ఇంతటితో నొకరి వెంట నొకరు ప్రభువులును, మతగురువులను, తమ తమ హక్కులను విసర్జ నముగావింప నారంభించిరి. దేశాభిమానములోను ఆత్మత్యాగములోను పోటీ గలిగెను. ఒక రికంటే మరి యొక "రెక్కువ త్యాగమున, జూపిరి.. అమితోత్సాహము ఫుట్టెను. దేశము కొరకై- ప్రత్యేక వ్యక్తులు చేసిన సమర్పణము లాఖరు కాగనే, డాఫిన్ రాష్ట్రపతినిధి లేని రాష్ట్రము నకుగల ప్రత్యేక హక్కుల సన్ని టిని వదలెను. ఒకటి వెంట నొకటి రాష్ట్రములు, పట్టణ ములు, వర్తక సంఘముల... అమతమ ప్రత్యేక హక్కులను . గౌరములను వదలుకొనిరి. ఆదిన మత్యంతశుభ దినముగా పరి గణించుటకు జాతీయసభవారు తీర్మానించిరి.పదునారవ లగాయి రాజునకు, ఫ్రెంచిస్వాతం త్యపునరుద్ధారకు డను బిరు దము నొసంగిరి. ఆదినమున ఫ్రాన్సు దేశములో "ఫ్రెంచిప్రజల యొక్క- పాలనము స్థాపింపబడెను..