పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179

పండ్రెండవ అధ్యాయము

లుండవలెనని కొందరు వాదించిరి గానీ, ఎక్కువమందిచే ప్రజా ప్రతినిధి సభ యొకటే యుఁడవ లెసని తీర్మానింపబడెను. దీనికి రెండు సంవత్సరముల కొకసారి యెన్నికలు జరుగును. గడువు లోపల దీనిని విచ్ఛిన్నము చేయుహక్కు... రాజునకు లేదు. సమస్త పరిపాలనాధికారములు నీసభ కుండును,


దేశములోని యిరువది అయిదు సంవత్సరముల వయస్సుగలిగి, సాలున కొక రూపాయి పన్ను చెల్లించు పౌరుల లందఱకును ఎన్నిక అధి కారము కలుగజేయ బడెను. ప్రతినిధి మాత్రము సౌలుకు ముప్పది రూప్యముల పన్ను చెల్లించువాడుగా నుండవలెను. ప్రజాప్రతినిధి సభ చేసిన చట్టమును రాజు రెండు సారులు తిప్పి వేయవచ్చును. మూడుసారి దానినే ప్రజా, ప్రతినిధిసభ వారు చేసిన యెడల, రాజంగీకరించక పోయినను, దానియంతట నదే చట్టమగును.

అత్యంతము
దేశాభిమానము

.

పైన చెప్పబడిన ప్రత్యేక వాక్కుల నాశనములోను, మాసవ సమానత్వస్థాసనములోను, అత్యంతమైన దేశాభి మాసములో ననేక మంది ప్రభువులును మత గురువులుసు కూడ హృదయ పూర్వకముగా తోడ్పడిరి. తమ ప్రత్యేక హక్కులను గౌరవ ములను తామే ముందుగా విసర్జించి ఆత్మత్యా గమునకు మార్గదర్శకులగుచు వచ్చిరి, నోయలిసు ప్రభువు అందరికిని త్రోవజూపెను. ప్రభువుల న్యాయవిచారణహక్కు , వేటహక్కు, రైతులవలన బలవంతముగ పనిచేయించుకొను హక్కు మొదలగు హక్కులన్నియు వెంటనే రద్దుకావలెనని