పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
178

“ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


మే కావలెను. పుట్టుక నుబట్టి యియ్యబడవు. మఠముల యొక్క అభివృద్ధి - ప్రజ లిచ్చు పన్నులు తీసి వేయబడెను, ప్రభువుల యొక్కయు, మతగురువుల యొక్కయు భూముల కిదివరకు పన్ను లనుండిగల మినహాయింపులన్నీయు రద్దుపరచ బడి అం దటి భూములకును సమాసముగ పన్నులు వేయబడెను. - జాతీయసభవారు మానవులకు స్వభావముగా నుంట్టియు, భగవ దుద్దేశ్య మైనట్టియు హక్కుల ప్రకటనమును , కావించిరి. (1) స్వాతంతమును, ప్రాణ మాన విత్తముల సంరక్షమును, వీనికి భంగముగలుగ జేయ యత్నించినవారి సెదుర్కొనుట యు, ప్రతి మానవునికిని సహజమైన హక్కులు, 2) హక్కులుతో మనుష్యులందుసు పుట్టినారు. (8) చట్టముల ముందఱ పౌరులుదరుసమానులు, (4) యోగ్యత, సామ ర్థ్యము నను భేదములుతప్ప తక్కిన యెట్టి భేద ములును లేక , ప్రభు త్వములోని అన్ని యుద్యోగములకును పౌరులందఱును అర్హు లు. (5) దేశమునకు ప్రజలే ప్రభువులు. (6) ప్రజల యొ క్క యుద్వేశ్యములను దెలుపుటయే చట్టము. ఈ ఆరు వాక్కులును ఎవరును తీసివేయుటకు వీలు లేని సహజహక్కు లని శాసించబడెసు. ప్రభువులు, మతగురువులు, ప్రజలు నను భేదము రద్దుపుచబడెను. పత్రికాస్వాతంత్యము, వాక్స్వాతం త్యము "దేశీ యులకందఱికిని నియ్యబడెను. పౌరులు ఎవరియి యిష్టమువచ్చిన మతమును వారవలంబించవచ్చు ననియు, ప్రభుత్వ మువారేమతము నవలంబింపరనియు, ఏమతమునందు నెక్కువ గౌరవమును జూపరనియు ప్రకటించబడెను. రెండు శాసనసభ