పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

177

పండెండవ అధ్యాయము


వెనుకంజ వేయుటకు వీలు లేని సరియైన పునాదుల మీద జాతీయ ప్రతిష్టాపనలను నిర్మించిన తరువాత, కొలది నెలలలో దేశము లో శాంతి, సంపద, సంతృప్తి నెలకొలుపబడునని వీరి తలంపు .

(4)

ప్రజాహక్కు ల
స్థాపనము,

1789 సంవత్సరము ఆగష్టు నెల 4 వ తేదీ ఫ్రాన్సు దేశ చరిత్రలో కెల్ల ముఖ్యమగు దినము. ఆ సాయంతనము ఫ్యాన్సులో అదివఱకు శతాబ్దములనుండి పాదుకొనియుండిన మొఖాసాప్రభుపరంపరయును, మతగురువుల యాధిక్యతయును జాతీయసభచే నాశనము చేయబడెను. ఇంతట నుండియు ఫ్రెంచి దేశము లోని మనుష్యులందరును జాతి భేదములు లేక సమానహక్కు' బాధ్యతలు గలవారని శాసించబడెను.చట్టము లందుకును. సమానముగ వర్తించును. అందఱకిని సమానమగు స్వాసంత్య ములుండును. పుట్టుక యొక్క గాని ధనము యొక్క గాని ఆధిక్యత యుండదు. ప్రభువులకును మతగురువులకుసుగల స్యాయవిచార ణహక్కులు, ప్రత్యేక గౌరవములు, రైతులచే బలవంతముగ పనిచేయించుకొను హక్కులు, ప్రభువులకు గల వేల హక్కులు, కొన్ని ప్రదేశములకును, పట్టణములకును, వర్తక సంఘములకును గల ప్రత్యేక వర్తకహక్కులు, "మొదలగు ప్రత్యేకహక్కు లన్ని యు రద్దుపజచ బడెను. రైతులకును ఇతర సామాన్య ప్రజలకును గల నిర్బంధము లన్నియు తొలగించ బడెను. వ్యవసాయక బానిస త్వము సంపూర్ణముగ రద్దుపఱచ బడెను. సివిలు, సైనిక, మతవి షయిక ఉద్యోగములన్నిటికిని యోగ్యత, సామర్థ్యము మాత్ర