పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169

పండ్రెండవ అధ్యాయము

కాస్టింకోట నేల మట్టము గావింప బడుట. రాజధానిలో తిరుగు బాటులు జరుగును. ఈవిధముగా రాజు యోచించి, లేచివచ్చిన ప్రభువులను మతగురువులను తిరగ వెళ్ళి ప్రజాప్రతినిధులతో చేరి యొ కేసభగా నేర్పడవలసినదని చెప్పి పం పెను. ప్రజాపక్ష మునకు సంపూర్ణ జయము కలిగెను (జూన్ 26.)

(2)

బాస్టిలు కోటనేల
మట్టము గావింప
బడుట

ఈ కాలయాపనవలన ప్యారి సునగరవాసులలో నుద్రే కము హెచ్చెను. ప్రతిదినము . వేలకు వేలు ప్రజలు సభలు జరిపి వక్తలు గంభీరోపన్యాసముల గావించు చుండిరి. రాజ యొక్క, బంధువుడగు ఆర్లీ యన్సు ప్రభువు ప్రభుపక్ష మునువదలి ప్రజా పక్షము చేరెను. ఆయననగరునకంటి యొక పెద్ద తోటగలదు. దానిచుట్టును పుస్తకములను కాఫీని పల హారములను అమ్ము దు కాణములుండెను, ఆమధ్య సున్న విశాల మైన ప్రదేశములలో వేలకొలంది ప్రజలు సమావేశమగుచు ఉపన్యాసములను వినుచుండిరి. అక్కడకు పోలీసు వారు గాని ప్రభుపక్షవాదులు గాని వచ్చుటకు భయపడు చుండిరి.


ప్రభుత్వము వారు శాంతిని నెలకొలుపవలె సను మిష మీద ప్యారిసు,వర్సేల్సు పట్టణములయొద్ద స్విసు, జర్మను సైన్య ముల నుంచిరి. ప్యారిసుసు ముట్టడించి సైనిక శాసనమును ప్రవేశ పెట్టుదురేమోయని ప్యా రిసు ప్రజలు భయపడుచుండిరి. ఈ సైన్య ములను తీసి వేసి ప్రజల యైచ్ఛిక భటులను తయారుచేయవల సివదని జాతీయ ప్రతినిధులు కోరిరి.కాని రాజు సమ్మతించ