పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
170

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

. లేదు. నెక్కరుమంతీ 'రాజున కీవిషయములలో సహాయము చేయుట లేదు. కాస జులై 11 వ తేదీన రాజు నెక్క రుమంత్రిని పద భ్రష్టుని జేసి ఫ్రాస్సు దేశ ముసుండి వెంటనే లేచిపోవలసినదని యాజ్ఞాపించెను. నెక్కరును తీసి వేసినందుకు జాతీయ సభవారు ఖం డితముగా తమ అసమ్మతిని రాజునకు తెలిపెరి. కాని ప్రయో జసము లేదయ్యె. నెక్క రుండగా రాజు పటాలములను జాతీ యసభ పై నగాని రాజధానిమీద గాని ప్రయోగించ డనునమ్మక ము ప్రజల కుండెడిది. నెక్కరును వెళ్ళగొట్టి రసువార్త మరు సటియుదయమున ప్యారిసుపట్టణములో వ్యాపించెను. ప్రజలలో కలిగిన యాందోళనమునకు మేరలేదు. రాజు వెంటనే సైన్య ములను ప్రయోగించి ప్రభావిప్లవమును బలవంతముగా సణచి వేయునని భయము హెచ్చెను. సభా వేదిక పై కామిల్ డెమొ లిన్" అను యువకు డెక్కి “పౌరులారా! నెక్కరును వెళ్ళగొట్టి నారు. దేశాభిమానుల సందఱను నరికి వైచుటకు యత్నించు చున్నారు. లేపండి! తుపాకులు తీసికొని లేవండి! ప్రతివారు నొక పచ్చనియాకులుగల కొమ్మును గుర్తుగా పుచ్చుకొని బయలు దేరుడు!” అని హెచ్చరించెను. చెట్లకొమ్మలు తీసి కొని ప్రజలు బయలు దేరిరి. నెక్కరు యొక్క పటమును తీసి కొని ప్రజలు ఊరేగింపుతో వచ్చుచుండగా, రాజు యొక్క జర్మసు గుఱ్ఱముదళము ప్రజలపై బడి తోక్కి గుంపులను చెదరగొట్టినది. ప్రజలయాగ్రహమునకు మేర లేదు. మూడు వేల అయిదువందల మంది 'ఫ్రెంచి సైనికులు ప్రజలపక్షమునకు వచ్చి చేరిరి.తుపాకలు, కత్తులు,గొడ్డళ్ళు మొదలగు