పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
168


{{Center|ఫ్రెంచి స్వాతంత్ర్య విజయ} }

ప్రజాప్రతినిధులు
రాజు నెదిరించుట


జూన్ 28వ తేదీన లూయీ రాజు దర్భారుచేసెను. ప్రతినిధుల నందరిని సమావేశపరచెను. . రాజు యొక్క చిత్త మును మంత్రులు వినిసించిరి. “మూడు శాఖ లను విడిడిగనే కూడవలసినది. రాజుగారి యుత్తరువు. పైన నేదైన ప్రత్యేక విషయముల లో అందరును. కలియవచ్చును. ముఖ్యముగా మత సాంఘిక రాజకీయవిషయములను ప్రత్యేకముగానే చర్చించ వలెను. ఇది రాజుగారి యాజ్ఞ. అందరు ప్రతినిధులను. వెంటనే వెళ్ళిపోయి రేపు ఎవరికి నిర్ణయమయిన ప్రదేశమున వారు ప్రత్యేకముగా గూడవలసినది. ఇట్లు చేయని చో రాజుగారే తన ప్రజల సౌఖ్యమున కవసరమగు చర్యలు జరుపుదురు,” అని మంత్రులు సెలవిచ్చి. దర్బారు చాలించగ నే రాజును, చాలమంది ప్రభువులును, మతగురువులును వెడలిపోయిరి. మిగిలిన వారును, ప్రజాప్రతినిధు లందరును తమ స్థానములను వదల లేదు. ప్రజాప్రతినిధి బైలి యగ్రాసనాధిపత్యమును వహిం చెను. రాజు యొక్క యుర్యోగస్థుడగు డిబ్రె .. అచటకు వచ్చి రాజు గారియుత్తరువును వింటి రా యని యడిగెను. ప్రజాప్రతి నిదులకు నాయకుడు గానున్న మీరాబో రాజుగారినోట పలి కంచబడిన మాటలను వింటిని.మేము లేచిపోము. మమ్ము సు వెడలగొట్టమని మీ కుత్తరువులున్నచో, పటాలములను తెచ్చి వెళ్ళగొట్టుడు” అని ప్రత్యుత్తరమిచ్చెను. రాజు చర్య పుచ్చుకొనుటకు శంకించెను. పటాలములను బంపినను సైనికి భటులు కాల్చుటకు నిరాకరించెదరు. పైగా