పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
166

"ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

తక్కినవారొప్పుకొనలేదు. లూయీ రాజు ప్రజల ఆస్తి కిని ప్రాణమునకును సురక్షితమునిచ్చు "చట్టములు తాను చేయు ట కేమి, కొంత అధికారమును ప్రజాప్రతినిధు లవశము చేయు ట కేమి సిద్ధముగ నుండెనేగాని, ప్రభువులు, ప్రజలు, మతగురు పులు నను భేదము నాశనమై అందరును ప్రింఫ్రెంచిజాతిలో చేరి పోవుట కొప్పుకొన లేదు. తన రాచరికము ఓ పాటు ప్రభువులు, గురువులు, ప్రజలు సను భేదముకూడ నుండవ లెనని యే నిశ్చ యిచెను. రాణికిని ఇదే అభిప్రాయము. నెక్కరుమంత్రి దవ్య సంబంధమయిన ఇబ్బందుల నుండి ప్రభుత్వము తొలగిన తరువాత, ప్రభువులును మతగురువులును కలిసి యొక సభగాను, ప్రజా ప్రతినిధులు వేరుసభ గాను చేరుట యుక్తమని తలచెను. ముందుగా ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితిని గూర్చి ఒక్కరు గొప్ప యుపన్యాసమును చేసి, మూడు శాఖ లేయవిషయము లను కలిసి చర్చించవలెనో, వేనిని విడిగా చర్చించవలేనో, నిర్ధారణ చేయుటకు కమిషనరుల నేర్పాటు చేయవలసినదని సలహా నిచ్చెను. తమ్ము నెన్ను కొనిన ఫ్రెంచి ప్రజలయుద్దేశ్య ప్రకారము, ప్రభువులును మతగురువులును అనుభవించు చుండిన ప్రత్యేక హక్కులును ప్రత్యేక లాభములును సంపూర్ణ ముగా రద్దుపరిచనిది, మరియొక పని ప్రారంభించగూడ దను దృఢనిశ్చియముతో ప్రజా ప్రతినిధులు పచ్చిరి. తక్కిన రెండు శాఖలును తమతో చేరనిది, ఏపనియు తాము చేయమని ఖండితముగా చెప్పిరి. దినదినమున కీపోరాటము హెచ్చెసు. ప్యారిసు పట్టణములోని బీదజనులకు తిండి ప్రియమై క్షుద్బాధ