పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

పండ్రెండవ అధ్యాయము

హెచ్చుగా నుండెను. ప్రజాపక్షవాదులు తీవ్రమైన యుపన్యాస ములు గావించుచుండిరి. ప్రజలలో నాగ్రహము హెచ్చెను. ప్రభువులు, మతగురువులు నాశనముగానిది తగుకు కడుపునిండ భోజనము దొరకదని ప్రజలు తలంచసాగిరి. ఒకే సభ గా కూడుటకు వ్యతిరేక పక్ష మువారినందరిని ప్రజలు తొందరచేయసాగిరి. రాజధానియొక్క, ప్రజాభిప్రాయమువలన స్టేట్సుజనరల్ లోని ప్రజాప్రతినిధుల పట్టుదల హెచ్చెను. జూస్ 17 వ తేదీన ప్రజాప్రతినిధులు (నేషనల్ ఎస్సంబ్లీ) జాతీయసభ యను పేరును 'బెట్టుకొని, ప్రభువులును, మతగురువులును తమతో చేరినను, చేరకపోయినను తామే దేశము యొక్క నిజమయిన ప్రతినిధులమనియు, దేశము తరఫున సర్వకార్యములను చేయుటకు తమకే సర్వాధికారము గలదనియు శ్రీర్మానించిరి. కొంత మంది ప్రభువులును చాలమంది సామాన్యమత గురువులును వీరిలో చేరిరి. రాజునకును రాణికిని నాగ్రహము కలిగెను. జూతీయ సభను సభ చేయుచున్న మందిరములోనుండి, దానిని బాగుచేయవలసియున్న దసుమీషమీద వెడలగొట్టించిరి. ప్ర జాప్రతినిధులందరును (టెన్నీసుకోర్టులో) బంతులాడుకొను ప్రదేశములో సమా వేశమై, జాతీయ ప్రభుత్వమును స్థాపించు వరకును తాము వీడిపోమని జూన్ 20 ప తేదీన శపథములు చేసికొనిరి. బయట ప్రజలగుంపు లాతురతతో కని పెట్టుకొని యుండిరి.