పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పండ్రెండవ అధ్యాయము

ఫ్రెంచి విప్లవము

(1)

టెన్ని నుకోర్టు,
శపధము,

1789 వ సంవత్సరము మే నెల 5వ తేదీన వర్సేల్సు పట్టణమున దేశ ప్రతినిధిసభయగు స్టేట్సు జనరలు సమావేశ మయ్యెను. అతి వైభవముతో పదునారవ లూయీ రాజు దానిని తెరచెను. 270 మంది ప్రభు ప్రతినిధులుసు 291 మంది మతగురువులుసు 564 నుంది. ప్రజాప్రతినిధులును హాజరైరి. ప్రజా ప్రతినిధుల పక్షమున ఫ్రెంచిజాతి యుండెను. మూడు శాఖ లును కలిసి యొకే సభగా చేరి చట్టములు చేయవలెనని ప్రజా ప్రతినిధులు కోరిరి, కొద్దిమంది. ప్రభుప్రతినిధులును మరి కొంతమంది మతగురువులుసు మాత్ర మిందుకు సమ్మతించిరి.