పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
162

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము


నుంచియు పెంచిరాజులు కూర్చలేదు. ఇప్పుడు పదునారవ లూయిరాజు దేశములోని యాందోళ నముబట్టి ప్రతినిధిసభ ను ప్రజలవిశ్వాసమును బడయుట కై ప్రజానురంజకుడుగ నుండిన నెక్కరును తిరిగి ప్రధానమంత్రి నియమించెను. 1778వ సంవత్సరం ఆగష్టులో బ్రయన్ రాజీనా' మా నిచ్చెను. కాని యొక గొప్పసమస్య బయలు దేరెను. తమ ప్రతినిధుల సంఖ్యతో నమానముగ నే మతగురువుల ప్రతినిధులు సంఖ్యయు నామాన్య ప్రజల ప్రతినిధుల సంఖ్య యుసుండ వలేసని ప్రభువులుకోరిరి.. దేశములో ప్రభువులుసు మతగురువులుసు స్వల్పసంఖ్యాకులనియు, సామాన్య ప్రజ. లు రెండున్నరకోట్లు గలరనియు, సొమాన్య ప్రజాప్రజ ప్రతినిధుల సంఖ్య, ప్రభువుల ప్రతినిధులు, గురువుల ప్రతినిధులు కలి. సిన మొత్తముకంటె, తక్కువగా నుండుటకు వీలు లేదనియు, ప్రజ లాందోళసము జరిపిరి. చిన్న మతగురువులు సామాన్య ప్రజలలోనే చేరిరి. మరియొకతగాదా గలిగెను. ప్రభువుల సభ వేరుగాను మతగురువుల సభ 'వేరుగాను ప్రజాప్రతినిధి సభ వేరుగాను నుండవలయుననియు నిర్ధారణ చేయు విషయములో ఒక్కొక్క సభ కొక్కొక్క వోటుచొప్పున నుండవలెననియు ప్రభువులుసు గురువులును చెప్పిరి. ప్రభువులు, గురువులు, ప్రజలు అందరు కలసి ఒ కేసభలో చేరి చర్చించి విషయముల సన్నిటిని పరిష్కారము చేయవలెననియు, ఎక్కువ సంఖ్యాకులు యభిప్రాయమును బట్టి తీర్మానములు కావలెననియు, ప్రజలు చెప్పిరి. ఈ రెండు విషయముల మీదను చర్చలు విశేషముగా