పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163

పదునొకండవ అధ్యాయము


జరిగెను. వాదప్రతివాదములు ప్రబలెను. అక్కడక్కడ దెబ్బలాటలకు దిగెను. ప్రభువులను, వారిపక్ష ము వారిని ప ప్రజలు గేలి సేయసాగిరి. అప్పటివరకు, ప్రభువులయొక్కయు గురువులయొక్కయు ప్రత్యేక హక్కులన్నియు నాశనము చేసి, ప్రజలందరికిని సమానహక్కులు సమాన భాధ్యతలుగల ప్రభు త్వముగా చేయవ లెనని మాత్రమే ప్రజలు కాంక్షించిరి. రాజునందు ప్రజలకు ద్వేషము లేదు. రాజును తీసివేయవలె సని ప్రజలు తలచలేదు. కాని లూయి రాజునకు, ప్రజలకు నా యకుడగుటకు తగిన వివేచనగాని నైపుణ్యముగాని లేదు. ఆకా లవు నూతనాభిప్రాయముల తీవ్రతను గుర్తించ లేక పోయెసు. ప్రభువులయిష్టమును కోల్పోవుటకు భయపడి తుదకు ఆ రాజు సింహాసనమును గోల్పోయెను. ఆబీ సైసు అను నాయన వ్రాసిన కరపత్రములో ప్రజాపక్ష మువారి యభిప్రాయములు స్పస్టీక రించబడెను. "ప్రజా ప్రతినిధి సభ (మూడవ శాఖ) అనగ నేమి?" అని ఆయన ప్రశ్నించి, "అదే ఫ్రెంచిజాతి" యని జవాబు వ్రాసెను. “ప్రభువులు, మఠాధిపతులు కలిసి 15 లక్షలు లేరు. తక్కి నప్రజలు 2 కోట్లు గలరు, ప్రభువులు, మఠాధిపతులు సోమరి పోతులు. ఇతరులు కష్టము చేయగా దాని ననుభవించు తిండి పోతులు. జాతియొక్క యభివృద్ధి కాటంకము గలుగ జేయు వారు. సామాన్య ప్రజలను దాస్యములోను కష్టపరంపరలోను- ముంచెడివారు. వీరు లేకపోవుటవలన పెంచిజాతి కేమియు నష్టముగలదా? లేదు. లేక పోగా ఫ్రెంచిజాతి స్వేచ్ఛను సౌఖ్య, మును పొందును. సామాన్య ప్రజలే నమస్త ఉపయోగకర