పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ అధ్యాయము

లోనే ఋణములు దొరకుట లేదు. ఆదాయముకన్న వ్యయ మెక్కువయయ్యెను. యావత్తు పరిపాలనా పద్ధతిని, పన్నులను, ఆదాయవ్యయములను సంపూర్ణముగా సంస్కరించినగాని ప్రయోజనము లేదని యాయన గ్రహించెను. కాని సంస్కరణ మునకు యత్నించగానే ప్రభువులు మొదలగు వారియాటంక ములు గలిగెను. 1787 వ సంవత్సరములో కలోనుమంత్రి రాజీనామా నిచ్చెను. తరువాత రాణీగారి సిఫారుసు మీద నేర్పజచ బడిన మంత్రి బ్రయన్ కూడ ఏమియు చేయజాలకపోయెసు. ఇట్టి తరుణములో (స్టేట్సుజనరల్) దేశ ప్రతినిథి సభను పిలువ వలసినదని అన్ని పక్షములవారినుండియు గొప్ప యాందోళనము ప్రబలెను. రాజు అసమర్థుడనియు మంత్రులు నిస్సహాయులనియు అందరికిని తెలిసెను. " ప్రతిసంవత్సరము ప్రభుత్వముపో యాదాయముకంటే వ్యయము 20 లక్షల సుచిరను లెక్కువగు చుండెను. ఇదిగాక ప్రభుత్వము వారు తెచ్చిన ఋణములకు వడ్డీ యియ్యవలసి యున్న చి. దేశములో ధర లెక్కువయినవి. కర వు వ్యాపించినది. వ్యవసాయము, పరిశ్రమలు క్షీణించినవి. ఏ ప్రజా భివృద్ధికరమగు పనిచేయుటకును ప్రభుత్వములో దవ్యము లేదు. రాజకుటుంబము యొక్కయు వారిచుట్టు చేరు బృందము యొక్కయు పరిజనుల యొక్కయు విలాసములు, వైభవములు, దుర్వ్యసనములు 'ముదలగువానికి కావలసిన ఖర్చుమాత్ర మావంతయైన తగ్గ లేదు. సైన్యములలో అసంతృప్తి ప్రబలెను. బీదరయితులు, పనివాండ్రు, కూలీలు, అక్కడక్కడ తిరుగు బాటులు ప్రారంభించిరి. ప్రతినిధి సభను 1664 సంవత్సరము