పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
160

ఫ్రెంచ్వాతంత్ర్య విజయము


. లేకపోయెను. 1781 సంవత్సరం ఇంగ్లీషు సేనాధిపతి కారన్ వాలీసు ప్రభుపు నార్తుకరోలినాను పట్టుకొన యత్నించి విఫలతనొంది యార్కు టౌను మీదికి వచ్చెను. అమెరిక నుల సేనాని జార్జి వాషింగ్టన్ ముట్టడించెను. సముద్ర ముమీద ఫ్రెంచివారి యోడ సైన్యము క్రొత్త సైన్యము లింగ్లాండు నుండి రాకుండా కాపాడెను. ఇంగ్లీషు సైన్యములు పూర్తిగ నోడిం పబడినివి. కారన్ వాలీసు ప్రభువు అమెరిక నుల చేతిలో చిక్కె ను. ఫ్రెంచినావికాసేనాధిపతి డిగ్రాసి ఇంగ్లీషు వారియో డసైన్యము నోడించెను. ఇంగ్లాండులోని ప్రధానమంత్రి నార్తు ప్రభువు "అంతా అయిపోయినది” అని చెప్పి రాజీ నామా నిచ్చెను. 1782 సంవత్సరము నవంబరు నెలలో ఇంగ్లీ షువారు సంధి చేసికొనిరి. ప్యారిసు సంధి వలన అమెరికాసం యుక్త రాష్ట్రముల స్వాతంత్యము సంపూర్ణముగ సంగీక రించ బడెను.

3

స్టేటు జనరలు
సమావేశ పరుచుట

నెక్కరు రాజీనామానిచ్చిన తరువాత ఫ్రెంచి రాజు, కలోనును ప్రధానమంత్రిగా నియమించుకొనెను. ఈయన కూడ ప్రభుత్వముస కై ఋణములు చేయసాగెను. ప్రత్యేక హక్కుల ససుభవించు చుండిన ప్రభువులు మొదలగు వారితో కలహించక నెటులనో కాలము గడపుచుండెను, 'రాణీగారు గోరిన ధనమును మంత్రి యా మెకిచ్చుచు ఆ మెయనుగ్రహ ముసకు పాత్రుడయ్యెను. కాని కలోను మంత్రి కి కొద్ది కాలము