పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

పదునొకండవ అధ్యాయము


చుకొనిరి. మనుష్యులందఱును సమానముగానే సృష్టింసబడి నారనియు, దుర్మార్గమైన ప్రభుత్వమును నిర్మూలనము గావిం చుటకు స్వభావమగు హక్కు ప్రజలకు గలదనియు, ఈహక్కు అన్ని కాలములలోను అన్ని జాతులకును గలదనియు రూసో "సోషల్ కంటాక్టు" అను గ్రంధములో వాసిన ధర్మము నే, అమెరివావా రసుష్ఠించినందున అమెరికా స్వాతంత్య ప్రకటనము ఫ్రెంచిప్రజలలో మితి లేని యుత్సాహము కలిగించెను. ప్రధమమున అమెరికావా రపజయముల నొందిరి.. బ్రక్లిన్ వద్ద ఇంగ్లీషు సేనాధిపతి, హెూ, అమెరిక సులను నోడిం చెను. అమెరికను సేనానీ వాషింగ్ట నోడిపోయి న్యూయార్కు పట్టణము నింగ్లీషువారీవశము చేయవలసివచ్చెను. 1777 సం వత్సగము వేసంగిలో వాషింగ్టను సేనాని ఫిలడల్ ఫియాను వద లవలసివచ్చెను. ఇంగ్లీషు సైన్యములు స్కుల్ కలువరకు అమెరి కను సేనలను నెట్టి వేసెను. ప్రతిచోటను అమెరికా వా రోడిపో యి అమెరికా ప్రజలలో నిరాశగలిగెను. ఇంగ్లీషు వారితో నెటు లయిన సంధి చేసికొనుట యుక్తమని కొందఱు చెప్పసాగిరి. కాని ఇంతలో 18 అక్టోబుకు తేదీన సరటోగా మిట్టస్థలములలో ఇంగ్లీషు సైన్యములను అమెరికా వారు సంపూర్ణముగ నోడించి బర్ గాయిన్" సేనాధిపతిని సైన్యములతోకూడ ఖయిదుచేసిరి. 1778 సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఫ్రెంచిపోరు. అమెరికా వారి సహాయమునకు వచ్చిరి. ఇప్పటి నుంచియు అమెరికను పక్షము విజృంభించినది. ఇంగ్లీషు వారు ఆగ్రహపరవశులై సమ ర్థులగు సేనాసుల కింద సైన్యములను వంపిరిగాని లాభము