పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
156

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజు మించెను. ఈయన తుర్గోకు సాటియగు రాజ్యాంగ వేత్త కాడు. ఈయనకు దృఢాభిప్రాయములు లేవుగాని యోగ్యుడు. దయ గలవాడు. ప్రజలకు మేలు చేయవ లెనను కోరిక గలవాడు. ఆర్థిక విషయములలో సమర్థుడు. 1778 వ సంవత్సరములో ఫ్రాన్సునకు ఇంగ్లాండులో యుద్ధము సంభవించెను. ఇంగ్లాం డు పై తిరుగుబాటు చేసి తమస్వాతంత్యము కొరకు యుద్ధము గావించుచున్న అమెరికా ప్రజలకు సహాయము చేయవలెనని ఫ్రెంచి మజలు కోరిరి. అందుమీద గత్యంతరము లేక లూయి ఇంగ్లాండుతో యుద్ధమున కొప్పుకొనెను. యుద్ధపు వ్యయ ముసు భరించుటకు మార్గములు మూడే గలవు. కొత్తపన్ను లను వైచుట, లేదా పరిపాలనా ఖర్చులను తగ్గించుట, లేదా ఋణము తెచ్చుట. మొదటి మార్గ మప్పటి స్థితిలో ససంభవము. రెండవది. కొంతవరకే సాధ్యము. కావున మూడవ మార్గమునే నెక్క రవలంబించెను. ఆయనకు కావలసిన ఋణము త్వర లోనే దొరకెసు. మధ్య మతరగతివ్రజ లుత్సాహముతో ఋణముల నిచ్చిరి. కాని ఇందువలన ప్రభుత్వమువారీ ఋణము విశేషముగా హెచ్చెను. నెక్కరు మంతిచే యత్నించిన కొన్ని సంస్కరణములను ప్యారిసులోను ఇతర చోట్లనుగల న్యాయాధి ఇతు "లెదిరించగా రాజు తనకు సంపూర్ణమగు చేయూత నియ్య సందున 'నెక్కరు 1.781 వ సంవత్సరములో మంత్రి పదవికి రాజీనామా నిచ్చెను. నెక్కరు యొక్క సామర్థ్యమును సమ్మి ప్రభుత్వమునకు ఋణమునిచ్చినవారి కందరకునుసు ఆశాభం గము కలిగెను..