పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155

పదునొకండవ అధ్యాయము

కులు రాజుతో చెప్పుకొనిరి. మత స్వేచ్ఛను పూర్తిగ నెల లిపి 'దేశ భ్రష్టులైన ప్రొటస్టెంటులను తిరిగి దేశములోనికి రానియ్యవలెననితుర్ఘో సలహానిచ్చెను. ఇందుకు రోమసు కాథ లిక్కు మతగురువులు తుగ్లోను ద్వేషించిరి. యావత్తు దేశము లోను ఒకేచట్టము, ఓ కేవిధమగు కొలపాత్రలు, తూనిక రాళ్ళు అమలులో పెట్టుటకు తుర్గో యుద్దేశించెను. ప్యారిసుపార్ల మేంటులోని న్యాయాధిపతులుసు, ప్రభువులుసు, ధనికులును, రోమను కాథలిక్కు మగురువులును తుగ్లోమంత్రికి వ్యతి రేకు లైరి. రాజు యొక్క సలహాదాగులు తుర్గోమంత్రికి వ్యతిరేక ముగ కుట్ర సలిపిరి. రాజు బలహీనుడై కుట్రకు లొంగెను. ముందుగ మాలె షె.ర్బీని మంత్రిత్వమునుండి తీసి వేసెను. 1776 సంవత్సరము మే నెల 12 ఏ తేదీన తుర్గో మంత్రిని కూడ తీసివేసెను. అవసరమయిన సంస్కరణములను ధైర్యముగా జేసి రాజ్యమునుకాపాడ దలచిన తుర్గో వంటి పేరెన్నికగన్న రాజకీయ దురంధరుని రాజు తీసి వేసిన తరువాత ప్రజు విప్లవము తప్ప ఫ్రాన్సు దేశమునకు 'వేరుశరణ్యము లేదయ్యెను. దూరదృష్టి గల బుద్ధి రాలులందఱును విప్లవము రాక తప్పదని అనుకొనిరి.


నెక్కరు మంత్రి,

తుర్గో మంత్రిని తీసి వైచిన తరువాత నాయన మూసీ వేయించిన ఏబది వర్తక సంఘములును తిరిగి తెర పించిరి. దెబ్బలు కొట్టి నిర్బంధముగా రాజు బాటలలో రయితులచేత కూలిపని చేయించిరి. ఆయన స్థానమున 1776 సంవత్సరము అక్టోబరు నెల లూయీ రాజు. నెక్కరును ప్రధానమంత్రిగా నియ