పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125

పదియవ అధ్యాయము

పదునాఱవలూయీ రాజు కాలమున ప్రపంచ చరిత్రము నందు మిగుల గొప్పదగు రాజకీయ సాంఘిక విప్లవము జరిగి, ఆయన శిరచ్ఛేదము. గావింపబడెను. ఆయన పూర్వుల పరి పాలనాలోపమువలన దేశమునం దేర్పడిన దుష్టమగు పరిస్థితు లును, ఆకాలమునందు - పరాసు దేశ ప్రజలలో వ్యాపించిన స్వతంత్రభావములుసు ఇందుకు కారణములు.

దుష్టమగు
పాలనము

పదునాలుగవ లూయీ రాజు మిగుల సమర్థుడై తన రాజరికమును సంపూర్ణముగ నిరంకుశముగా జేయుట చూచి యున్నాము. పదునేనవ లూయి కాలమున గూడ రాజరికము పూర్తిగా నిరంకుశముగనే యున్నది. ప్రభు పులు, షతగురువులు కూడ తమ మొఖాసాలలో నివసించు ప్రజలపై విచారణాధి కారమును కలిగియుండిరి. రోజు అవస రము లేకుండ విశేష సంఖ్యాకులగు ఉద్యోగస్థులను పెట్టుకొనె ను. వీరి కందఱకును చేయదగిన పని లేక వంతుల ప్రకారం పనిచేయు చుండిరి. పదమూడు పార్ల మెంటులుసు, నాలుగు రాష్ట్రీయ సంఘములును సివిలు, క్రిమినల్ విచారణ చేయు చుండెను. క్రిమినల్ కేసులలో ముద్దాయి యగువాడు తప్పించు కొనుట కష్టము. నేరము చేసిన ట్లోప్పుకొను వరకును మిగుల ఘోరమగు హింసలకు లోబడ జేసిరి. వకీలుసు "పెట్టుకొని యె దుటిసాక్ష్యము క్రాసుపరీక్ష చేయు హక్కు లేదు. మరణ శిక్షలే గాక అంగ వైకల్యముచేయు శిక్షలును, శరీరములో కొంత భాగము కోసి వేయు శిక్షులును కూడ ఇచ్చుచుండిరి. న్యాయాధి పతి తీర్పులలో కారణముల వ్రాయ నవసరము లేదు. విచా