పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదియవ అధ్యాయము


ఫ్రెంచి విప్లవకారణములు


1

పదనారవ
లూయి రాజు

పదునారవ లూయీ రాజు నిష్కళంక చారిత్రుడు. కాని పిరికివాడు. సదుద్దేశ్యములు గలవాడుగాని తన యు దేశ్యములను తన చుట్టునున్న వారికి వ్యతిరేకముగా నమలు జరుపులకు ధైర్యము లేనివాడు. ఈయన భార్యయగు మేరి ఆంటనెటు ఆస్ట్రియారాజు యొక్కకూతురు, ఈ మె మిగుల సౌందర్యవతి. విలాసములయందను రాగము గలది. ఈమెకు భర్తమీద చాల పలుకుబడి గలిగి యుండెను. ఆమె దుర్వ్యయము చేయుచుండెను. దుర్గుణ ములు కలదని చెప్పుటకన్న, దూరాలోచన లేనిదని చెప్పు నొప్పును.