పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
126

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


రణ రహస్యముగా జరుగవచ్చును. బహిరంగ విచారణ జరుప నక్కర లేదు. చెఱసాలలోనికి 'మేజిస్ట్రేటులు వచ్చి విచారించు చుండిరి. చెరపాలలో పెట్టినవారి నేదోవిధముగా శిక్షిం చుటయే న్యాయాధిపతుల ముఖ్యకర్తవ్యము. యధార్థము కనుగొనుట కాదు. న్యాయాధిపతులకు స్వతంత్రత లేదు. పై ప్రభుత్వోద్యోగులు చెప్పిన ప్రకారము శిక్షలు వేయుచుం డిరి. ఒక క్రైస్తవ దేవాలయమున కపచార మొస్చర్చినం దున కొక పంతొమ్మిది సంవత్సరముల కుర్రవాని నాలుకను, చేతిని,కోసివేసి బ్రతికి యుండగా మంటలలో బడి వేసి చంపిరి. తఱుచుగా ఎట్టి విచారణ లేకుండగనే రాజు అనిర్ది ష్టమగుకాలము వరకును ఖైదుశిక్ష గాని, దేశాంతర వాసశిక్ష, సుగాని, చుండెను. మేజిస్ట్రేటులకు జీతములు లేవు, ఇచ్చిన చోటుల తక్కువ జీతము లిచ్చుచుండిరి.. వారు ఇష్టము వచ్చిన విధమున కక్షి దార్ల యొద్ద డబ్బును వసూలు చేసిరి. రాజు ఉద్యోగముల దవ్యమిచ్చినవారి కమ్ము చుండెను. ప్రభుత్వమున కాదాయవ్యయ పట్టికలు లేవు. ప్రభుత్వబొక్క సములో నుంచి రాజు తన యిచ్చవచ్చినంత తీసికొను చుంచెను. రశీదు మాత్ర మిచ్చుచుండెను. రాజు యొక్క యుంపుడుకత్తె లకు సౌలునకు నలుబదిలక్షలు ఖర్చగుచుండెను. ప్రభుత్వపు ఆదాయముకన్న వ్యయ మత్యధికముగ నుండెను. ప్రభుత్వపు ఋణము ఎంతయున్నదో చెప్పుటకు మంత్రులకు కూడ కష్టముగ నుండెను. పరియైన లెక్కలు లేవు. రాజు ఇంద్రియ లోలుడై అత్యధికముగ దుర్వ్యయము చేయుచుండెను. ఆయన చుట్టును