పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

123

తొమ్మిదవ అధ్యాయము

పార్లమెంటు అనబడెడి న్యాయాధిపతుల సంఘము వారు రాజు నెదిరించ ప్రారంభించిరి. ఒక రోజున ఆంగ్లేయులచే శిరచ్ఛే. దము గావిం బడిన మొదటి చార్లెసు బొమ్మను చూపి, “అటు లనే మిమ్మను గూడి నీ పారిసుపార్ల మెంటువారు చేయదలచు కొన్నారు. జగత్త,” అని డుబెర్రి యువతి లుయీ రాజుకు చెప్పెను. లూయీ రాజు ఆందుమీద భయపడి న్యాయాధిపతు లను అరెస్టు చేయించి దేశ భ్రష్టులనుగావించెను. న్యాయాధి పతుల సంఘమును రద్దు పరచెను.


పదునేనవలూయీ రాజు 1774 వ సంవత్సరమున మరణించెను ఆయన మనుమడగు ఇరువది సంవత్సరముల ఈడు గల పదునారవలూయీ, సింహాసన మధిష్ఠించెను.