పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
122

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


పరచిరి. రణకౌశలుడగు ఫ్రెంచి సేనాని లాలీకి తగిన సహాయ'మురాక ఆంగ్లేయ సేనాని యగు క్లైవుకు లొంగవలసివచ్చెను. అమెరికా లోను ఇటుల నే ఫ్రాంస్సునుండి సహాయమురాక సమ ర్థులగు ఫ్రెంచి సేనానులు ఆంగ్లేయుల చేత నోడించబడిరి. 1763 వ సంవత్సరమున పారిసువద్ద సంధిజరిను, అమెరికా ఖండములోని కనదేశమును ఇంక కొన్ని ముఖ్యమగు ద్వీప ములను, హిందూ దేశ సామ్రాజ్యమును " ఫ్రెంచివారు. ఇంగ్లీషు వారికి వదలి వేసిరి. ఫ్రెంచి వారు హిందూ దేశములోని రాజుల కలహములలో జోక్యముకలుగ జేసికొనకుండునట్లును హిందూ దేశములో నెచటను కోటలు కట్టకుండునట్లును షరతులతో వర్తక ము కొరకై మాత్రము పుదుచ్చేరి, చంద్రనగరం, మాహి, కారెకాలు, ఏనాం పట్టణములు ప్రించి వారికి వశము చేయబడినవి. ఇంతటితో హిందూ దేశ సామ్రాజ్యమును, ప్రపంచ రాజ్యమును పాన్సు కోల్పోయి ఆంగ్లేయులకు సంక్ర మించినది.

చెడు పరి
పాలము.

పదు నేనవలూయికీ ఆదాయముకన్న ఖర్చు లెక్కువ యయ్యెను, ప్రభుత్వపు ఋణములు చాల వృద్ధి చెందెను. ఋణములను తీర్చుమా ర్గము కనుపించ లేదు. నిరంకుశముగ పన్నులను రెట్టింపు చేసెను. ఉద్యో గములను లంచమిచ్చువారి కిచ్చెను. ప్రజలు పన్నుల బాధలచే ఆంగిరి. ఆసంతృప్తి మిగుల వ్యాపించెను, పారిసులోని