పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
112

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

ఇంగ్లాండు, స్పెయిను, హాలండు, ఆస్ట్రియా, సావాయ్, ' డెన్ మార్కు, స్వీడెన్ యొకటిగా జేరెను. యుద్ధము ప్రారంభ మయ్యెను. తొమ్మిది సంవత్సరముల వరకు జరిగెను. భూమిమీ' దసుసముద్రముమీదను గూడ ఫ్రాన్సు కే జయముకలిగెను గాని యిందరితో పోరాడుటవలన ఫ్రాసుకు అపరిమితమైన ధనవ్య యము కలిగెను. తుదకు 1697 వ సంవత్సరమున రెస్విక్ వద్ద సం ధిజరిగెను. విలియమును నింగ్లాండునకు రాజుగా పదునాల్గవ లూ యీ అంగీక రించెను. ఫ్రాన్సు దేశము జయించిన దానిలో కొం తభాగమువదలి వేసెను. యూరపులో కెల్ల సైనిక బలమునందు ఫ్రాన్సు ప్రథమస్థానము వహించినదని స్థిరపడినది.

స్పైన్ వారసత్వము

స్పెయిన్ దేశపు రాజును 'రెండవచార్లెసు మూడు సంవత్స రములు వ్యాధిగ్రస్తులుగ నుండెను. అయనకు పిల్లలు లేరు. ఆయన చనిపోయిన తరువాత వారసులెవ్వరు? పదునాల్గవ లూయీరాజు యొక్క కుమారుడును ఆస్ట్రియాచక్రవర్తి యగు లియోపాల్డును, బవేరియా రాష్ట్రాధిపతియు నీముగ్గురును వారసులమని తలచుచుండిరి. స్పెయిను రాజు కిందనుండిన రాజ్యమంతయు ఫ్రాన్సుసురాజ కుమారునకుగాని ఆస్ట్రియా చక్రవర్తికిగాని వచ్చినచో వారు యూరపులో కెల్ల బలవంతులగుదు రను భయమువలన నింగ్లాండు మొదలగు దేశముల రాజులు స్పెయిన్ రాజ్యమును యీ వివిధవారసులకు పంపిణీ చేసికొను నటుల రెండు పంపిణి యేర్పాటులను చేయించిరి. ఇందుకు పదునాల్గవ లూయీ కూడ సమ్మతించెను. కాని యీపంపకము లేవియు 'స్పెయి