పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111

ఎనిమిదవ అధ్యాయము

దేశములో నిరంకుశత్వముండగా హాలండులో ప్రజాపాలన ముండెను. ఫ్రెంచి రాజు యొక్క నిరంకు శత్వమును ఖండించుచు వ్రాయబడిన గ్రంథములు హాలండులో ప్రచురించబడెను. కావున 1672 వ సంవత్సరమున పదునాల్గవ లూయీ రాజు హాలండు మీదికి యుద్ధము ప్రకటించెను. ఇంగ్లండు స్వీడెన్ రాజులకు లంచమిచ్చి హాలండు నుంచి విడదీసెసు. ప్రతిసాలున నిరువదిలక్షల లివరీలు ఇంగ్లాండు యొక్క రాజునకు నిచ్చెను. జరిగిన యుద్ధములో ప్రతిచోటను ఫ్రెంచివారికి జయమును డచ్చి వారికి " (హా లెండు), అపజయమును కలిగెను. ఇంతలో డచ్చి వారికి విలియమ్ ఆఫ్ ఆరెంజి నాయకుడయ్యెను. మీరు సంపూర్ణ ప్రజాస్వామ్యమును తీసివేసి ఆయనను స్టాడు హో ల్డరుగ చేసికొనిరి. ఆయన యూరపులోని రాజులనందరిని నాశ్రయించి ఆస్ట్రియా, స్పెయిసు, జర్మన్, ప్రభువులు మొదలగువారు ఫ్రాన్ సుకు వ్యతిరేకముగా నొక మాదిరిగా చేరునట్లు చేయగలిగెను. కొంతకాలము యుద్ధము జరిగి యిరు పక్షముల వారికిని విసుగుపుట్టి 1678 వ సంవత్సరమున నిం-వే- గన్ సంధితో యుద్ధము ముగిసెను. ఈ సంధివలన ఫ్రెంచి కౌంటి ప్రదేశము 'ఫ్రాన్సులో చేర్చుకొనబడెను. ఇంకను కొంత ప్రదేశము ఫ్రాన్సుకు దక్కెను. ఫ్రాన్సు యొక్క ప్రతిష్ఠ అనేక మడుంగులు హెచ్చెను. 1688 వ సంవత్సరమున నిం గ్లాండులోని ప్రజలు రెడన జేమ్సు రాజును వెడలగొట్టి హాలం డుస్టాడు హోల్డరగు విలియం ఆఫ్ ఆరెంజిని రాజుగా చేసి. కొనిరి. పదునాల్గవ లూయీ రెండవ జేమ్సును దగ్గరకుతీసెను.