పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
113

ఎనిమిదవ అధ్యాయము

రాజు యొక్క అనునుతితో జరుగలేదు. ఇంతలో స్పెయి రాజు చనిపోయెను. ఒక (వుయిలు) మరణశాసన ముసు వ్రా సెను. దానిప్రకారము రాజ్య మంతయు పదునాల్గవ లూయీ యొక్క రెండప మనుమడగు ఫిలిప్పునకు సంక్రమింపజేసెను. పదునాల్గవ లూయీ మరణ శాసనము ప్రకారము యావత్తు రాజ్యమును తన మనుమనికి కోరునా? లేక పంపకపు యేర్పా టుల పక్షమున నిలుచునా పదునాల్గవలూయీ రాజు తన మనుమనికి యావత్తు రాజ్యమును వశపరచెను. ఫిలిప్పు స్పెయిన్, దేశమునకు రాజయ్యను. వెంటనే యింగ్లాండు, హాలండు, ఆస్ట్రియా, జర్మనీ ప్రభువులు, పోర్చుగల్ దేశ పు రాజు లోక్క టై యుద్ధమునకు వెడలిరి. ప్రథమమున ఫ్రాన్సునకు జయము కలిగెను. తరువాత అపజయములు కలుగ నారంభించెను. పదు నాలవలూయీ సంధికోగేను. మిత్రమండలివారు తిరస్కరం చిరి. వెంటనే లూయీ ప్రాన్ సు దేశ ప్రజల నుద్భోధించి గొప్ప సేనలను తయారు చేసి శత్రువుల నోడించెను. 1713 వ సంవత్స రమున ఉటెక్టు వద్ద జరిగిన సంధివలన ఆల్సేసు, 'ఫెంచికంటి మొదలగు ప్రదేశముల సన్నిటిని ప్రాన్ సు దక్కించుకొనెను.. ఖైదులోనున్న ప్రొటెస్టెంటులను లూయీ విడుదల జేసెను. స్పెయిన్ రాజ్యము లూయీ రాజు యొక్క మనుమడగు ఫిలిప్పు స్థిరపడెను గాని అతడు ఫ్రాన్ సురాజ్యపు హక్కునుత్యజించెను.


పదునాల్గవ లూ బరాజు డెబ్బది రెండు సంవత్సరములు రాజుగా నుండి, 1715 వ సంవత్సరమున చనిపోయెను.