పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
92

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

అన్ని మతముల ప్రతినిధులను గౌరవించి హిందువులకును. బౌద్ధులకును జైనులకును సమానముగ ధర్మములు చేయు టను గూర్చియు ఆకాలమునందుండిన పూర్తియగు మత స్వేచ్ఛ. సుగూర్చియు హూయను త్సాంగు వర్ణించియున్నాడు. "హిందూ చేశములో బౌద్ధమతము క్షీణించుటకు కారణము, హిందూ రాజులు బౌద్ధులను హింసించి వెళ్లగొట్టుట వలన కాదనియు అట్టివి యేమియు హిందూదేశములో నెన్నడును జరుగనే లేదనియు హిందూమతము లోనికి ముఖ్యమగు బౌద్ధమత సిద్ధాం తముల నన్నిటిని జేర్చుకొని హిందూమతమునకు నూతనవికా సమునిచ్చి బోధించుటవలననే బౌద్ధమతము క్రమముగ హిందూదేశమునందు క్షీణించి చాలవరకు బౌద్ధులు నూతన హిందూమతమును స్వీకరించి” రనియు విన్సెంటుస్మిత్తు వ్రాసి యున్నాడు. బౌద్ధమతమును గూర్చి పెక్కు గ్రంథములు వ్రాసిన రైసు డేవిడు. "హిఁదూ దేశములోని బౌద్ధులను హిందువులు బాధ పెట్టిరనునది యథార్థము కాదు” అని వ్రాసియున్నాడు. శ్రీస్తుశకము 6 వ శతాబ్దములో మధ్య ఆసియానుండి 'హను' లను జాతివారు దండెత్తివచ్చి ఘూర్జర రాష్ట్రములోను, మధ్య హిందూదేశములోను రాజ్యములను స్థాపించగా వారి నంద రిని ' హిందూమతములోనికి చేర్చుకొని రాజపుత్రులనుగా జేసిరి. వీరు సూర్యవంశమునుండియు, చంద్రవంశము నుండియు పుట్టినటుల కట్టుకథలను గూడ న ల్లిరి. ఇపుడు రాజవుత్రస్థానము నేలు రాజపుత్రుల యొక్క పూర్వులు వీరే.