పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

ఏడవ అధ్యాయము

మహమ్మదీయపాలన
మున మత స్వేచ్ఛ

పూర్వకాలమున హిందూ దేశములో పూర్తియగు మత స్వేచ్ఛ యుండినటుల హిందూ దేశ చరిత్రనుండి ప్రబల నిదర్శనములు చూపియున్నాము. ఇక మహమ్మ మహద్ముదీయుల కాలమున ఎటులనుండెనో నిష్పక పాతబుద్ధితో చూడవలసియున్నది. మహమ్మదీయ పాలనము హిందూదేశములో స్థాపించబడక పూర్వ ము హిందూదేశముపై దండెత్తి దోచుకొనిపోయిన మహమ్మ దు గజసీని బట్టియు, మొగలాయి రాజ్యము పడిపోయిన తరు వాత దండెత్తి హిందూ ముసల్మానులను హింసలుగావించి దోచుకొనిపోయిన నాదర్జాను బట్టియు, మహమ్మదీయపాలన మును విమర్శించగూడదు. ఇటులనే అరాజక కాలమున దేశము ను దోచుకొన్న మరాటాదండులను బట్టి శ్రీ శివాజిఛత్రపతి స్థాపించిన మహారాష్ట్ర రాజ్యమును విమర్శించగూడదు. మహ మ్మదు గజనీయు, నాదర్షాయు కేవలము దోపిడిగాండ్రు. రాజ్యస్థావకులు కారు. మహమ్మదీయులు హిందూదేశములో పాలన మేర్పరచుకొనిన తరువాత హిందువుల మతవిశ్వాస ములతోను, ఆరాధనలతోను జోక్యము పుచ్చుకొన లేదని గట్టి గా చెప్పవచ్చును. యూరపులోవలె మతము పేర నిర్బంధము లుగానీ, హత్యలుగాని, యుద్ధములుగాని ముసల్మానుల పాలన మున జరుగ లేదు. జరిగిన యుద్ధములు స్వమతవ్యాపకము కొఱకును పరమతనాశనము కొఱకును గాక, కేవలము రాజ్య