పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

ఏడవ అధ్యాయము


వైష్ణన, సౌర, శాక్తేయ, గాణాపత్యాది వివిధ శాఖలవారును మిగుల స్నేహభావముతో మెలగు చుండిరి. పూర్తియగు మత స్వేచ్ఛ మత సహనములు ప్రబలి యుండెను” అని ఫాహి యాను వాసెను. క్రీస్తుశక పారంభమున హిందూ దేశము లోని చాలభాగము నేలిన ఆంధ్ర రాజులు హిందువులైనను బౌద్ధమతమును గూడ మిగుల గౌరవించి బౌద్ధమత ప్రతి ష్టాపనలకును చాల సహాయము జేసిరి. తరువాత రాజ్య మునకు వచ్చిన గుప్తరాజులు వైష్ణవులగు హిందువులయి నను ఆకాలము నందుండిన హిందూ, బౌద్ధ, జైనమతము లను సమానముగా జూచిరి. 606 వ సంవత్సరమున రాజ్యము నకువచ్చిన హర్ష చక్రవర్తి బాహ్మణులను, బౌద్ధభిక్షులను గూడ తన రాజ్యములోని , పాఠశాలల కుపాధ్యాయులుగా నియమించెను, ఈయన బౌద్ధమఠములను హిందూ దేవాలయ ములనుగూడ కట్టించెను. హర్షుని తాత శివుని పూజించెను. హర్షుని తండి సూర్యుని పూజించెను. హర్షుడు శివుని, సూర్యుని, బుద్ధునికూడ పూజించెను. అప్పటికే పౌరాణిక హిందూమతము దేశమున బాగుగ వ్యాపించెను. ప్రతి మానవుడును తన యిచ్చ వచ్చిన మతమును స్వీకరించి తన యిచ్చవచ్చిన దైవము నారా ధించు చుండెను. అందఱును సోదర భావముతో మెలగు చుండిరి. ఈ రాజు పాలించుచుండగా చైనాదేశమునుండి హూయను త్సాంగసు మరియొక బౌద్ధయాత్రికుడు. హిందూదేశమును దర్శించుటకు వచ్చెను. ఈ రాజు క్రీస్తుశకము 643 వ సంవత్సర మున ప్రయాగలో వొక గొప్పమత సమా వేశము గావించి