యుగపురుషుడు వీరేశలింగం
- తాజాకూర్పు, ఉపోద్ద్ధాతం:
- తెలకపల్లి రవి
- పుటలు : 336, వెల : రు. 270/-
- ప్రతులకు : ప్రజాశక్తి బుక్ హౌస్
- గవర్నరుపేట
- విజయవాడ - 2
- సెల్ : 0866-2577533
కందుకూరి వీరేశలింగం (1848-1919) ఒక గొప్పవ్యక్తి ఏకైక వ్యక్తి కాదు, అనేకానేక విషయాల సమష్టి. “ప్రబుద్ధ భారత యుగకర్త, ఆంధ్ర వైజ్ఞానిక సంస్కరణోద్యమములకు మూలపురుషుడు, ఆధునికాంధ్ర వాజ్జయమునకు అధిష్టాత, సాంఘిక స్వాతంత్య్ర పిపాసి, స్తీ జనోద్దారకుడు” ఆరుద్ర చెప్పినట్టు. అటువంటి ఉజ్జ్వల చారిత్రకుని ఏ బీరుదుతో వర్ణించినా అది అసమగ్రమే!
గత సం॥ కందుకూరి శతవర్థంత్యుత్సవాలు జరుపబడిన సందర్భంలో రెండు పుస్తకాలు ఆవిష్మరింపబడ్డాయి. ఒకటి - చెన్నపురి తెలుగువాణి, డా॥ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువడిన సంకలనంలో కందుకూరి సాహితీ తత్త్వం, కందుకూరి సామాజికతత్త్వం పేరున 32 వ్యాసాలతో నివాళి అర్బంపబడింది. రెండవది - తెలకపల్లి రవి ముందుమాటతో ప్రజాశక్తి బుక్‌హౌస్, విజయవాడ, “యుగ పురుషుడు వీలేశలింగం” పేరున అందించిన అరుదైన ప్రచురణ. అయితే ఈ పుస్తకం 1963 వ సం॥లో, కందుకూరి 115వ జయంతి సందర్భంగా మొదటి ప్రచురణగా వెలువడింది. ఇప్పుడు ఆ పుస్తకం యథాతథంగా, కందుకూరి శతవర్ధంతి సందర్భంగా పునర్ముద్రింపబడింది. అదనంగా ఉన్నవి రెండు తెలకపల్లి రవి 'ముందుమాట,' రెండవది ఆంధ్రపత్రిక లో నాడు ప్రచురితమైన వీరేశలింగం మరణవార్త గురించిన కథనాలు.
పరిశోధకులూ, పండితులూ కూడా కందుకూరి బహుముఖ 'సేవలపైనా, రచనలపైనా, ప్రజ్ఞాపాటవాలపైనా, జీవిత సాహిత్యాల పైనా విశేష అధ్యయనం చేస్తూనే వచ్చారు. ఈ పునర్శుద్రిత పుస్తకంలో, కందుకూరి జీవితం, సంఘసేవ, భాషా సేవ, రచనలు, స్తీ జనోద్యమం, స్థాపించిన సంఘాలు, నిర్వహించిన పత్రికలు - యిలా అన్ని విషయాలపై సమగ్రమైన వివరాలను తెలియచేసే వ్యాసాలు (37), కవితలు (15) ఉన్నాయి. “యుగపురుషుడు” (నార్ల), “సర్వతోముఖ సంఘ సంస్కర్త (మామిడిపూడి), “నాటకములు” (ఖండవల్లి), “ఉపన్యాసములు” (ఎన్వీ జోగారావు), “కవి చరిత్ర పరిశోధన” (మల్లంపల్లి సోమశేఖరశర్శ), “ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మ?” (కనుపర్తి వరలక్ష్మమ్మ), మొ౹౹ ప్రముఖుల వ్యాసాలు; కవితల విషయానికి వస్తే, రాయప్రోలు వారి “మూల పురుషుడు ' విశ్వనాధ వారి “వీరేశలింగ స్మృతి, కాళోజీ కర్మయోగి కందుకూరి దాశరధి “నీరాజనము”, సి.నా.రె. “మణిదీపం ఆరుద్ర 'యుగపురుషుడు మధునాపంతుల 'వీరేశలింగోదాహరణము” వంటి ప్రముఖ కవులు వ్రాసిన కవితలున్నాయి. ఇంకా ప్రధానంగా చెప్పవలసినది, కందుకూరి పై విశేష అధ్యయనం చేసిన అక్కిరాజు రమాపతి రావుగారి రెండు వ్యాసాలు - “పంతులు గారి గ్రంథ రచనా, ముద్రణములు, వివరములు, రెండవది, “కందుకూరి జీవితము నందలి కొన్ని ముఖ్య ఘట్టాలు” ఉన్నాయి.
ఒక్కొక్క రంగంలో కందుకూరి ముద్ర ఏమిటో, దోహదమేమిటో తెలుసుకొనటానికి, సాహిత్యరంగంలో దిగ్ధంతులు అయినవారు వ్రాసిన అధ్యయనాల సంపుటి అని దీనిని పేర్మొనవచ్చు, ఆ విధంగా వీరేశలింగం ప్రభావం చూపిన, ప్రేరణ యిచ్చిన అన్ని రంగాల గురించిన సమగ్ర విషయ సంపుటి ఈ పుస్తకం. మన సాహిత్యంలో చరిత్రకు ప్రాధాన్యమిస్తూ “ఆంధ్ర కవుల చరిత్రను అందించిన క్రాంతదర్శి, కందుకూరి చరిత్రను యీ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం మొదటిసారి 1963లో జరిగి, యిప్పుడు పునరావృతమై మళ్లీ 60 సం॥లకు పునర్ముద్రణగా మనముందుకు వచ్చింది. మనమంతా, ముఖ్యంగా స్త్రీలంతా, కందుళూరికి శాశ్వతంగా కృతజ్ఞులంగా ఉంటూ, వారి మహత్తర సేవను స్మరించుకోవటానికి; కందుకూరి ప్రబోధించిన భావాలను మననం చేసుకొనటానికీ, ఈ పుస్తకం తోడ్పడుతుంది.
-ఎం.వి.శాస్త్రి, 9441342999
మాతృత్వపు మధురిమల మల్లిలపందిరి
- తల్లీ! నిన్ను తలంచి”
- (కన్నబిడ్దల గుండె చప్పుడు)
- పుటలు : 25/7, వెల : అమూల్యం
- ప్రతులకు : 102,
- గగన మహల్ అపార్ట్‌మెంట్స్, దోమల్‌గూడ
- హైదరాబాదు, ఫోను : 040 - 27636172
“మాతృదేవోభవ” అని ఉపనిషత్తులు తల్లిని తొలిదైవంగా లోకానికి చాటి చెప్పాయి. “నాస్తి మాతృ సమో ఛాయా / నాస్తి మాతృ సమాగతిః అని స్మంథ పురాణం పేర్కొంటుంది. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అని శ్రీమద్రామాయణం నిరూపించింది. సకల చరాచర సృష్టికి మాతృ స్వరూపిణి జగన్మాత సంకల్పమే ఆదిమూలం.
భూమిపై పుట్టిన ప్రతిప్రాణికి అమ్మ అమృతం. అమ్మ ఒక అద్భుతం. సమాజంలోని సమస్త రంగాలలో ఉన్నత సోపానాలను అధిరోహించిన వ్యక్తుల విజయపరంపరలకు తొలి సోపానం తల్లి. వ్యక్తిని శక్తిగా తీర్చిదిద్దగల మాతృమూర్తి ఔన్నత్యాన్ని పలు కోణాలలో నిరూపించిన ప్రత్యేక రచన ప్రముఖ కవయిత్రి 'కళారత్స సాహితీ బాంధవి” డాక్టర్ చిల్లర భవానీదేవి గారు ఏర్చి కూర్చిన 'తల్లీ! నిన్ను