పుట:February 2020.అమ్మనుడి.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేసినాడు కదా. పొట్టి శ్రీరాములుగారు ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయలేదే, మదరాసు నగరం కోసం ప్రాణాలను వదిలేసి నాడు. ఆయన త్యాగానికి కూడా విలువ కట్టకుండా తట్టాబుట్టా సర్దుకొని పారిపోయిరి. పోయేటబుడు ఊరకే పోకుండా మదరాసు లోనీ అరవ బోర్జుల్నంతా కొట్టీ తగలబెట్టి మసిపూసి పొయ్యేసిరి. ఇపుడు ఇక్కడ ఉండిపోయిన లక్షాంతరం తెలుగువాళ్ల గతి ఏమవుతుంది? మన హోసూరువాళ్లం మెదటినింకా ఆంధ్రోద్యమంలో పాలు పంచుకొంటిమి. మనల్ని ఎంత పక్కకు నెట్టేసిరి వాళ్లు! ఆంధ్రరా్ష్రానికి తలనగరం, కర్నూలా విజయవాదా అని ఓటింగు పెట్టినపుడు, మన ఎం.ఎల్‌.ఏ. మునిరెడ్డి కూడా ఓటింగులో పాలు గొని కర్నూలుకు ఓటు వేసినాడు. ఆంధ్రేతరుల ఓట్లు చెల్లవని కోస్తా ప్రాంతం నాయకులు గోల చేసేపిరే, మనం ఆంధ్రేతరులమా, అరవం పొడంటేనే గిట్టనీ మనం తెలుగువాళ్లం కాదా, నట్టేట్లో పుట్టిముంచేసి పోడిసిరి అంటారే అట్ల చేయలేదా వాళ్లు, రేపు మన్నాడు మనం మన తెలుగుకోసం పోరాడినా పట్టించుకాంటారా?”

“ఆ నిజలింగప్ప వెనకాల నడిచి మ్రైనూరు ర్యాష్టంలో చేరిపోయింటేనూ ఈ ఇక్కట్టు లేకపోయుండును. ఆంధ్రనాయకులను నమ్మి మోసపోతిమి”.

“నువ్వ అట్లనుకోవద్దు. నీజలింగప్పకు మన హోసూరు తావు మీద రవంత కూడా అక్కరలేదు. ఆయనకు హుబ్లిని తలనగరం చేయలేదనీ కోపం. పైగా హోసూరు ప్రాంతంలో కన్నడ్రిగులున్నా లింగాయతులు చానా తక్కువ. లింగాయతులు ఎక్కువగా ఉండే తాళవాడి ఫిర్మా (కోయంబత్తూరు జిల్లా) కోసం కొట్లాడిన దాంట్లో పదిశాతం కూడా మన హోసూరుకోసం గొంతెత్తలేదు ఆ మహన్న బావుడు”.

“నిజలింగప్ప కతను పక్మనపెట్టంది. మైసూరు స్టేట్‌కు బెంగు ళూరును తలనగరం చేసిరి - మనం అట్ల చేరిపోయుంటే ఎంత అందుబాటు, ఇరవై ఐదు మైళ్ల దూరంలో తలనగరం, ఒకపూట సంగటి తినేసి నడిసిపోతే కూడా రెండోపూట సంగటిపొద్దుకు

చేరిపోవచ్చు.

“రాజథధానీ నగరం మాత్రమే చూసుకొంటే సరిపోతుందా? కన్యాకుమారి నింకా కేరళ రాజధాని త్రివేండ్రం రెండుగంటల పయనం. చెన్నపట్నం ఐదువందల మైళ్లు. అయినా కన్యాకుమారి తమిళులు పోరాడి మద్రాసు రాష్ట్రంలోకి ఎందుకు చేరిరి? బీదరుకు హైదరాబాదు 60 మైళ్లు. బెంగుళూరు ఐదువందల మైళ్లు. ఫజలాలీ కమిటీ బీదరు జిల్లాను ఆంధ్రాలో కలపమనే సిఫార్సు చేసింది. బీద రులో కన్నడ సంగాలు గగ్గోలు పెట్టలేదా? రాజధానీతో సామాన్య మానవుడికి పొద్దుకూ ఏం పని ఉంటుంది? భాషా రాష్ట్రాలు అనేవి ఎందుకు ఉందాలనుకొంటిమి? చదువూ ఉద్యోగమూ పరిపాలనా అంజా జనం భాషలో, జనానికందరికీ తెలిసే భాషలో ఉండాలని కదా. ఇపుడు మద్రాసు రాష్ట్రంలో ఉండిపోతే తెలుగువాళ్లమైన మనం దరం తమిళపాలనకు సర్జుకోలేమనే కదా మన ఆందోళనంతా. మైసూరు రాష్ట్రంలో చేరింటే తమిళం బదులుగా కన్నడం పాలనాభాష అయింటుంది. దానివలన మనకు జరిగే మేలు ఏముంటుంది?”

“సడే విడవండి. ఏది ఏమైనా అరవ పెత్తనానీకి హోసూరు జనం లొంగుతారనేది అబద్దం. పెత్తనం చేయాలని చూస్తే తిరగబడి తీరుతారు”.

“సాంతభాషమీదా సొంత నేలమీదా జనంలో ఎప్పుడూ అఖి మానం ఉండనే ఉంటుంది. వాటికి ప్రమాదం వచ్చినపుడు తిరగబడే తత్వమూ ఉంటుంది. అయితే జనాన్నంతా ఒక్కటి చేయగలిగిన వాడొకడు ఉందాలి. అతను నాయకుడు కావచ్చు యోజకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, జనంలోనీంకా ఆ ఒక్కడూ తయారై నిలబడితే ఇంక జనం అడుగులు నిలబడవు తదబదడవు” మా గురువుగారి మాటలతో సమావేశం ముగిసింది.

నూనూగు మీసాల వయసునాది. అసలే ఉడుకునెత్తురు. ఇంకా

కుతకుత ఉడికింది ( 77 ఏదేళ్ల వయసునాదిష్పుడు ఇంకా ఆ ఉదుకు చల్లారనే లేదు).


(389 వ పుట చరువాయి)

అందువల్ల చాలా బాధపడ్డాను. నాకు తెలిసిన, నా చుట్టుపక్కల ఉన్న జనం, నేను నమ్మిన ప్రజలే అవమానం చేశారు. ఇక వేరే ఊరివాళ్ళు అవమానీంచకుండా ఉంటారా? అనీ అనీపించింది.

ఈ సంఘటన జరిగిన రెండు రోజులు నేను ఇంటినుంచి బయటికి రానేలేదు. ఊరివాళ్ళతో మాట్లాడటానికి కూడా అవమానంగా అనీపించింది. భయం వేయసాగింది. ఎవరైనా ఏమైనా అంటాదేమోననే భయం వెంటాడుతుండేది. ఆ సంఘటన జరిగిన రెందేళ్ళు ఊళ్ళోని ఏ కార్యక్రమాలకు వెళ్ళలేదు.

“ఎవరైనా నువ్వు మగజోగమ్మవి, కార్యక్రమంలో పాల్టొనకు” అనీ అంటాదేమోననే భయం వేధించేది.

అందుకే ఏ కార్యక్రమానికి వెళ్ళలేదు.

నాలో ఉన్న అలాంటి భయాన్ని దూరం చేసినవారు

మరియమ్మనహళ్ళికి చెందిన శ్రీమతి నాగరత్నమ్మగారు, ఆమె బృందం.

మా ఊరిలో జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేశారు.

పోగొట్టుకున్న సంతోషాన్నీ అవకాశాన్ని నాకు ఇచ్చారామె.

ఎవరైతే నాటకంలో వేయకూడదని అన్నారో, వాళ్ళ చేతనే చప్పట్లు కొట్టించారు.

పోగొట్టుకున్న చోటే నాకు గౌరవమర్యాదలు లభించాయి.

ఇది జోగమ్మలకు దారికిన గౌరవం అనుకున్నాను.

ఇప్పుడు సమాజం మారింది.

మమ్మల్ని కూడా బాగా పలకరిస్తున్నారు.

స్రీ కళాకారులు మమ్మల్ని చేర్చుకుని నాటకాలు ప్రదర్శిస్తుండటం దీనికి సాక్ష్యం !

(తరువాయి వచ్చే సంచికలో....)

| తెలుగుజాతి పత్రిక ఇమ్మనుడె ఆ ఫ్ర్రవరి-2020 |