పుట:February 2020.అమ్మనుడి.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కంటపడితే, తినండగ్రా అంటా గుప్పెడు పంచేస్తాడు.

సతీ అనసూయ వంటి తెరాటలు వచ్చినపుడు కొటాయిల మీద అంటీ ఆరే దీపాలను (సీరియల్‌ సెట్స్‌) పెడతారు. ఆడవాళ్లకు వాటినీ చూపిస్తా “చూడండమ్మా, ఆ అనసూయమ్మలో సత్యం లేకపోతే దీపాలు వాటంతట అవే అంటి, అవే ఆరుతాయా, చూడండమ్మా ఆ తల్లి సత్యాన్నీ” అనీ తెరాటకు ప్రచారం చేస్తాడు. జనాలంతా అనసూయమ్మ పేరుతో అంజిలీదేవికి భక్తులయిపోతుంటారు. అంజిలీదేవి అంటే మా పల్లెల్లో సాక్షాత్తూ దేవతే.

ఇట్ల చిన్నోళ్లడూ పెద్దోళ్లకూ ఆడోళ్లకూ మగోళ్లకూ అందరికీ తలలోనాలుక మా అనంతయ్యనవారు. ఇంతేకాదు, వార పత్రికలలో వచ్చే ధారావాహికలన్నిటినీ కలిపి గట్టి అట్టవేసి కుట్టి పొత్తాలుగా చేసి, చదువుకోడానికి ఇస్తుంటాడు. అనెంక అనెంక అయ్యవారిని చూసి ఎందరో ఈ పనిని చేసుకోసాగిరి. అనంతయ్యవారు కనుమరు గయినా, ఆయన నేర్పిన అట్టపొత్తాల పనీతనం మా పల్లెల్నింకా అంటిపెట్టుకానే ఉంది.

ఉదుకునెత్తురు

మా గురువుగారింట్లో ఆంధ్రోద్యమం గురించి మాట్లాడుకొంటా ఉండే మేస్టర్లు ఇంకొక సారి సమావేశమయిరి.

“మన గతి ఇంతేకద సార్స్‌ అరవ పెత్తనం కిందనే ఇంక తరతరాలు బతకాలేమో!”

“ఏం చేసేది! భౌగోళికంగా మన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలోకి చేరడం ఇంక జరగని పని. మద్రాసు రాష్ట్రంలో ఉంటూనే తెలుగును

| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |


“దక్షిణ భారతంలోనీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడాదికొక దగ్గర సమావేశమై భాషా అల్బ సంఖ్యాక వర్షాల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని నిర్ణయం తీసుకొన్నారంట. మనకు కావలసింది ఏముంది, మన తావున బడిలో ఏలుబడిలో తెలుగు ఇట్లనే నడిస్తే చాలు”

“నడవనిస్తారా అనేదే కదా సందేహం. మద్రాసు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్‌ పార్టీయే ఉంటుందని ఏమి నమ్మకం! ప్రాంతీయ పార్టీ అయిన డిఎంకె బలపదతా ఉంది. ఆ అన్నాదొర ఉపన్వాసాలు వింటుంటే వెన్నులో వణుకు పుడతావుంది. వడుగన్‌ నమ్మవనల్ల నల్లవనల్ల అనే నినాదాన్ని ఎత్తుకోనుందాడు. అంటే ఉత్తరాదివాడు మనవాడు కాదు మంచివాడు కాదు అని కదా. ఉత్తరాదివాడు అంటే హిందీవాడు అనీ అందరూ ఏమారిపోతుందారు. ఆంధ్రోద్యమం చేసినందుకు తెలుగువాళ్లమీద కసినిపెంచుకోనుండారు అరవ నాయ కులు. ఆ కోపమంతా మనమీద చూపిస్తే మనకు దిక్కెవరు? ఆ ఆంధ్రావాళ్లని నమ్మేకి అవుతుందా?”

“నమ్మేకి సాధ్యం లేదు. మొదట్నింకా ఆంధ్రా మేధావులూ నాయకులూ మనల్ని పట్టించుకోనే లేదు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఆంధ్రర్యాష్ట్ర చిత్రపటాన్ని తయారించింది ఎప్పుడు, 1930-40 నడుమ అనుకొంటాను. ఇంకా ముందరే ఉండచ్చును కూదా. దాన్లో మన హోనూరు తావును చేర్చనేలేదు. ఆయన గొప్పవాడే మహనీయుడే, కానీ ఒక్క పొరపాటుతో లక్షల గొంతులకు ఉరులు