పుట:February 2020.అమ్మనుడి.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంశాలు, సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం భావో ద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండడం కూడా పలు వర్ణాలలో ప్రభుత్వ చర్యలు అనుమానాస్పదంగా మారుతున్నాయి. మోదీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా రిజిస్టర్‌, పౌరసత్వ రిజిస్టర్‌ వంటి చర్యలు సహితం వివాదాస్పదంగా మారడంతో రాజ్యాంగంపై ప్రమాదం అంటూ నినాదాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి కొన్ని మౌలిక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయం ఏర్పరచే ప్రయత్నం చేయకుందా, రాజకీయ ప్రయోజనాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇటువంటి సమస్యలు ఏర్చడు తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాలే ఒక జాతిని నడిపిస్తాయి. కేవలం రాజ్యాంగంలో హామీలు ఇచ్చినంత మాత్రం చేత ప్రజలకు భరోసా ఏర్పడదు. ఉదాహరణకు భారతదేశంతోపాటే సుమారు 60 ఆసియా, పసిఫిక్‌ దేశాలు స్వతంత్రం పొందాయి. అవ్వన్నీ ప్రజా స్వామ్య పక్రియను అనుసరించాయి. అయితే నేడు భారత్‌ లో మినహా మరే దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా మనుగడలోలేదని చెప్పాలి. నిరంకుశ వ్యవస్థలో, మతరాజ్యాలలో ఆయాదేశాలలో నెలకొన్నాయి.

మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్‌లు మొదట్లో లౌకిక, ప్రజాస్వామ్య దేశాలుగా ఆవిర్భవించాయి. కానీ తొందరలోనే అవి మత రాజ్యాలుగా మారాయి. తరచూ సైనిక పాలనలను చూస్తు న్నాయి. కాబట్టి కేవలం రాజ్యాంగ నిబంధనలో ఏ దేశంలో కూడా స్వేచ్చ, స్వాతంత్రాలను కాపాడలేవు. అందుకు బలమ్రైన సామాజిక, సాంస్కృతిక నేపధ్యం కూదా అవసరం.

నేడు మన రాజ్యాంగానికి ఏర్పడుతున్న ముప్పు విధాన నిర్ణ యాలు తీసుకొనే రాజకీయ పార్టీలు మౌలిక రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్లననే అని అర్ధం చేసుకోవాలి. నేడు దేశంలో రెండు, మూడు పార్టీలు తప్ప దాదాపు అన్నీ ఒక కుటుంబం. లేదా ఒకరిద్దరు వ్యక్తుల చేతులలో అధికారం కేంద్రీకృతం అవుతూ ఉంటున్నది. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబం

సొంత ఆస్తులవలే కొనసాగుతున్నాయి.

అంతర్గత (ప్రజాస్వామ్యం దాదాపు ఏ పార్టీలో కనిపించడం లేదు. నేడు రాజ్యాంగానికి కీలకమైన ముప్పు మన రాజకీయ పార్టీల వ్యవస్థ నుండే తలెత్తుతున్నదనీ గమనించాలి. కీలకమైన అంశాలపై పార్టీల అత్యున్నత కమిటీలలో కాని, మంత్రివర్థాలలో కానీ లోతయిన చర్చలు జరగడం లేదు. నాయకత్వం ఇష్టానుసారం, వారి ప్రయోజనా లకు అనువుగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి.

రాజ్యాంగ పర వ్యవస్థలను సముచిత రాజకీయ ప్రయోజనా లకు నిర్వీర్యం కావించడం, రాజకీయ ప్రక్రియలో విధానాలకు కాలం చెల్లడం నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధానమ్టైన సవాల్‌ శాసన మండలి తమ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు బిల్లులను తక్షణమే ఆమోదించకుందా కాలయాపనకు ప్రయత్నం చేసిందనే ఆగ్రహంతో - ఆ వ్యవస్తే అవసరం లేనీ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వృవహరించదాన్ని చూసారు.

ప్రజలకు జవాబుదారితనం, పాలనలో పారదర్శకత నేత్తు మచ్చుకైనా కనిపించడంలేదు. చివరకు పంచాయత్‌, మునిసిపల్‌ ఎన్నీకలలో సహితం కాంట్రాక్టర్లు, మద్యం వ్యాపారులు, దళారీలు రాజ్యం ఏలుకుంటే ప్రజల పాలనకు అర్దం లేకుండా పోతున్నది. నేరస్థులకు సీట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను ఆదేశించాలని ఎన్నీకల కమీషన్‌ సుప్రీంకోర్ట్‌ను అభ్యర్థించవలసి రావడం పతనమవు తున్న మన రాజకీయ విలువలకు అద్దం పడుతున్నది.

నేరస్థులు, ధన రాజకీయాలు-మన ఎన్నికల వ్యవస్థలో అధి పత్యం వహిస్తున్నారని అందోళనలు వ్యక్తం అవుతున్నా ఎంతగా అధికార దుర్వినియోగం చేసినా, ధనరాశులను కురిపించినా, అధికార పార్టీలు అరుదుగా మాత్రమే తిరిగి ఎన్నిక అవుతూ వస్తున్నాయి. అంటే మన రాజకీయ పార్టీలకన్నా మనప్రజలు మనరాజ్యాంగ విలువ లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రజల నిఐద్దతే మన రాజ్యాంగానికి శ్రీరామ రక్ష,


(41 వ పుట తరువాయి)

“అప్పుడే మేము గుర్రపు స్వారికి వెళుతున్నాం. అతను అలాగే కాళ్లకు చెప్పులైనా లేకుందా మా గుగ్రాల పక్మనే నడిచాడు మేం వెళ్లమని అనుజ్ఞ ఇచ్చేదాకా!”

దారిలో మరో పెద్దమనిషి కలిశారు.

“అతను మమ్మల్ని చూడగానే బండి దిగి, చెప్పులు వదిలేసి, ఆ దుమ్ములో అలాగే ఒంగిఒంగి సలాములు చేస్తూ నీలబడి పోయాడు - మేం దాటి పోయేదాకా! తరువాత మా యింటికొచ్చి, మేం స్వారీ నుంచి తిరిగి వచ్చేదాకా - దాదాపు గంటన్నర సేపు - వరండాలో కాచుకొనీ వుండిపోయాడు”.

ఇంకోసారి ఆమె వద్దకు ఒక పెద్దాయన వాంటరిగా వచ్చి, భర్తనెలా వట్టుకరావాలో సలహా ఇచ్చి వెళ్లాడు. కొన్ని అబద్దాలైనా చెప్పడానికి - “పొ చేత వొప్పించమని మరీమరీ చెప్పాడు. తాను తరచు “అయ్యగారికి ఈ సలహా యిుస్తున్నా ఆయన చెవిన పెట్టదంలేదట. అమ్మగారైనా చెప్తే అయినా వింటాదేమోనని

| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |

అనుకొన్నాడట.

“అయ్యగారు చాలా మంచివారు. నిజాయితీపరులు. ఎప్పుడూ మాతోనే ఉంటారు. తాను ఏం అనుకొాంటాడో అది అనేస్తారు. ఇట్టా చెప్పెయ్యడం మంచిదికాదని అయ్యగారికి మీరైన చెప్పందమ్మా. అందరూ అబద్దాలు చెప్పేవారే. కానీ అయ్యగారి పద్ధతివేరు. మంచిదే. అందరూ ఎలా చెప్తున్నారో అయ్యగారూ అలాగే చెప్పాలి. అప్పుడు అయ్యగారనీ చాలా డబ్బు వస్తుందొ అని అతను బోధ చేశాడు.

“అది ఇంగ్రీషువాళ్ల పద్ధతి కాద” నీ చెప్పాను. ఐతే నేటివుల మాదిరి అబడ్దాలాదే ఇంగ్లీషువాళ్లు చాలా మంది వున్నారనీ, వాళ్ళంతా బోలెడు డబ్బు సంపాదించి సుఖంగా వున్నారనీ అతను వాదించాడు. చివరకి అబద్దమాడి డబ్బు సంపాదించడం తప్పనీ, అది తన భర్తకు గాన్సీ తనకుగానే ఇష్టంలేదని గట్టిగా చెప్పిన తర్వాత “ప్ప్‌ ప్‌. ఏం చేద్దాం అని జాలిపడుతూ వెళ్లిపోయాడు.

(తరువాయి వచ్చే సంచికలో...)