Jump to content

పుట:February 2020.అమ్మనుడి.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిట్టచూపు

చలసాని నరేంద్ర 9849569050

రాజ్యాంగంపై ప్రమాదం ఎవరి నుండి!

సుమారు మూడేళ్ళ పాటు లోతైన సమాలోచనలు అనంతరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం ఏ అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడించింది. మొన్ననే భారత రిపబ్లిక్‌ 71వ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నాము. భారత దేశ చరిత్రలో ఇదొక్క మహోజ్వలమైన ఘట్టం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా, ప్రజలందరికి స్వేచ్చ, స్వాతంత్య్రాలను, సమాన అవకాశాలను కలిగిస్తూ, ఎటువంటి వివక్షతకు అవకాశం లేకుండా మనలను మనం రూపొందించుకున్న మహత్తర ఘట్టం.

ఒక వంక దేశం అంతా రిపబ్లిక్‌ దే ఉత్సవాలను జరుపుకొంటుండగా, దేశంలో కొందరు, ముఖ్యంగా ప్రతిపక్షాలు, పలు అంశాలలో వాటి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న వివిధ ప్రజాసంఘాలు, భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనే నినాదాలు ఇస్తున్నారు. “రాజ్యాంగాన్నీ కాపాడండి” అంటూ కొన్ని రోజులుగా దేశంలో పలు నగరాలు, పట్టణాలలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు.

ఒక దేశపు రాజ్యాంగం ఆ దేశం ప్రజల సాంస్కృతిక, భావాత్మక ఆలోచనలకు, విలువలకు అద్దం పడుతుందా? లేదా రాజ్యాంగం మేరకు ఆ దేశ ప్రజలు నడుచు కుంటారా? అన్నది - ఈ సందర్భంగా తలెత్తే ప్రధాన ప్రశ్న నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌ ఆమోదం పొందిన జమ్మూ కాళ్ళీర్‌ లో ఆర్టికల్‌ ౩70 అమలును నిర్విర్యం చేయడం, ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం.

వాస్తవానీకి ఈ రెండు అంశాలపై తొలి భారత ప్రధానీ జవహర్‌ లాల్‌ నెహ్రు నుండి వివిధ పార్టీలు, నేతలు స్పష్టమైన హామీలు ఇస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో కేవలం ఒక తాత్మాలిక ఏర్పాటుగా తీసుకొచ్చిన ఆర్టికల్‌ 370ని ఇదివరకే ఇందిరాగాందీ, పివి నరసింహారావు వంటి ప్రధానులు రాజ్యాంగ సవరణల ద్వారా నిర్వీర్యం చేశారు. ఇక పౌరసత్వ సవరణకు సంబంధించి నెహ్రు నుండి ఇందిరా వరకు పొరుగు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణం గానే ఉంది. వామపక్షాలతో సహా అన్ని పక్షాలు ఈ అంశంపై పార్లమెంట్‌లో గతంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

భారతరాజ్యాంగం అమలులోకి వచ్చినరోజే రిపబ్లిక్‌డే. 1947లో బ్రిటిష్‌ వలసపాలకులను సాగనంపి, ఆగప్టు15న స్వతంత్రం సాధించుకొంటే, ఆ తర్వాత సుమారు మూడేళ్లకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26న రిపబ్లిక్‌డేగా జరుపుకొంటున్నాము. అయితే చాలామంది స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డేల మధ్యగల వ్యత్యాసం గురించి తడబాట్లు పడుతుంటారు. గత సంవత్సరం ఆగష్టు15ను రిపబ్లిక్‌డేగా జరుపుకున్న ఢిల్లీ పోలీస్‌లకు వ్యతిరేకంగా ఒక కేసు కూడా నమోదైనది.

ఆగప్పు 15-విదేశీ పాలకుల నుండి స్వేచ్చ పొందిన రోజయితే, మనలను మనం ఒక సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించు కాన్నరోజు రిపబ్లిక్‌డే అని చెప్పవచ్చు. అందుకనే భారత ప్రజల సాధికారికతకు గుర్తు ఈ దినంగా భావించాలి. ఆగష్టు 15న జవహర్‌ లాల్‌ నెహ్రు ప్రధానిగా తాత్మాలిక భారతప్రభుత్వం ఏర్చడినా సాంకేతికంగా బ్రిటిష్‌ రాజు జార్డ్‌ మన దేశాధినేతగా కొనసాగారు.

1950 జనవరి 26న మనరాజ్యాంగంను అమలులోకి తీసుకు రావడంద్వారా భారత్‌ను ప్రజాస్వామ్య రిపబ్లిక్‌దేశంగా మనం ప్రకటించుకొని, మొదటి రాష్ట్రపతిగా డా. రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నాము. అందుకనే స్వతంత్ర దినోత్సవాన్ని ఒక విధంగా రాజకీయ పరమైన విజయంగా జరుపుకొంటూ ఉంటె, మనదేశ సాధికారితకు చిహ్నంగా, ప్రజల సార్వభౌమత్వా నికి గుర్తుగా రిపబ్లిక్‌డేను జరుపుకొంటాము.

రిపబ్లిక్‌డే రోజున ఢిల్లీలో భారతసేనలు తమ అత్యాధునిక ఆయుధాలను, పరాక్రమాలను ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా మనది అఖేద్యమైన జాతి అనే సంకేతం ఇస్తుంటాయి. ఈ సందర్భంగా జరిగే పెరేడ్‌ రాష్ట్రపతి భవన్‌కు సమీపంలోగల రైసినా హిల్‌ నుండి ప్రారంభమై, రాజ్‌పత్‌, ఇండియాగేట్‌ల ద్వారా ఎర్రకోట వరకు సాగుతుంది. త్రివిధ దళాల నుండి మన సాయుధ దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయిన రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు.

ఈ రోజున భారతీయులు అందరు సగర్వంగా మన జుతీయ పతాకాన్ని ఎగురవేసుకొంటూ, మనజుతీయగీతం “వందే మాతరం”, “జనగణమన 'లను ఆలపించుకొని, దేశ స్వాతంత్య్రం కోసం అసమాన త్యాగాలు జరిపిన స్వాతంత్ర సమరయోధులకు అంజలి ఘటిస్తారు.

రాజ్యాంగాన్ని జాతి సమగ్రత, భద్రతవంటి అంశాలను దృష్టిలో ఉంచుకోకుండా సంకుచిత రాజకీయ అవసరాల మేరకు అనవయించు కొనే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో నేడు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి ఖిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ చేబడుతున్న చర్యలు తమ విభజన రాజకీయాలకు ముగింపు కాగలవని పలు వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు ఉన్నది.

అదే సమయంలో, నరేంద్రమోదీ ప్రభుత్వంసైతం మౌలిక